Viral Video: ఎవరు బ్రో చెప్పింది.. అదంతా రాంగ్.. ఇది చూశాక నిర్ణయం మార్చుకోవాల్సిందే..!
చాలా మంది అంటారు..కుటుంబ బాధ్యతలు కేవలం అబ్బాయిలు మాత్రమే మోస్తారని..కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే.. మీరు కచ్చితంగా మీ నిర్ణయాన్ని మార్చుకుంటారు. ఎందుకంటే ఒక బాలిక ఓవైపు తన కుటుంబ బాధ్యతలను మోస్తూనే.. మరోవైపు తన కలలను సహకారం చేసుకునేందుకు కష్టపడుతుంది.. భుజాన బ్యాగ్, తలపై సిలిండర్ పెట్టుకొని విద్యార్థిని నడుస్తున్న వీడియో నెటిజన్ల హృదయాలను కదలించింది.

మధ్య తరగతి కుటుంబాల పిల్లలు ఎదుర్కొంటున్న కష్టాలను సోషల్ మీడియా మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఒక వీడియో కుటుంబ బాధ్యతలను కేవలం అబ్బాయిలే కాదు.. అమ్మాయిలు కూడా మోస్తారని తెలియజేడంతో పాటు ఫ్యామిలీ బాధ్యతలను భుజాన మోసేందుకు వయసు అనేది లేదని హైలెట్ చేసింది. dineshwar_0673’అనే X హ్యాండిల్‌లో షేర్ చేయబడిన ఈ వీడియోలో ఒక స్కూల్ విద్యార్థిని తలపై బరువైన గ్యాస్ సిలిండర్, భుజాని బ్యాగ్ వేసుకొని రోడ్డుపై నడుస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. అంత రద్దీ మార్గంలో నడుస్తున్న కూడా ఆమె ముఖంలో ఎలాంటి భయం కానీ, ఆందోళన కానీ కనిపించలేదు.. అంతేకాదు తలపై అంత బరువున్న ఆమె అడుగుల్లో తడబాటు లేదు. ఇది ఆమె ఆత్మస్థర్యం, కుటుంబబాధ్యతల పట్ల తనకున్న సంకల్పాన్ని చూపించింది.
ఈ వీడియో చేస్తేనే అర్థమవుతుంది తన రోజువారీ జీవితంలో ఆమెకు ఈ పోరాటం కొత్త కాదని. ఒకవైపు ఆమె తన చదువు కలను నెరవేర్చుకోవడానికి కష్టపడుతూనే,మరోవైపు కుటుంబ బాధ్యతను తన భుజాలపై వేసుకుంటోంది. ఇందకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో చాలా మంది నెటిజన్లు ఈ వీడియోపై తమ స్పందన తెలియజేశారు. చాలా మంది నెటిజన్ల హృదయాలను ఈ వీడియో కదలించింది.
ఈ వీడియోపై ఒక నెటిజన్ స్పందిస్తూ.. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత దేశంలో నేటికీ చాలా మంది అమాయక పిల్లలు పేదరికం కారణంగా తమ బాల్యాన్ని కోల్పోతున్నారని స్పష్టమైందని రాసుకోచ్చాడు. బాధ్యత వయస్సును చూడదు అనేది నిజం, కానీ సమాజం, ప్రభుత్వం దానిని చూడాలని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. మరికొందరు ఆ అమ్మాయి దృఢ సంకల్పం, జీవిత పోరాటాన్ని ప్రశంసించారు.
వీడియో చూడండి..
जिनको कंधो मे जिम्मेदारी होता है सब मोहमाया खत्म हो जाता है
चाहे लड़का हो या लड़की सबको अपना अपना घर का जिमेदारी निभाना पड़ता है pic.twitter.com/br3y0bgYZx
— dineshwar patel (@dineshwar_0673) December 7, 2025
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




