ఖతర్నాక్ కొడుకు కట్టుకథ..! ‘అతడు’ మువీలో మహేష్ క్యారెక్టర్ దించేశాడు సామీ..
చోరీలకు అలవటు పడ్డ ఓ కిలాడీ నేరగాడు ఎమోషనల్ డ్రామాలతో అటు పోలీసులను, ఇటు పలు కుటుంబాలను.. ఏమార్చి సినిమాను మించి నటించాడు. ఉచితంగా తింటి, బట్ట, వసతి కోసం ఇతగాడు వేసిన స్కెచ్ లు క్రిమినల్స్ కే రోల్ మోడల్ లా మారిపోయాడు. అసలేం చేశాడంటే..
సూపర్ స్టార్ మహేశ్‌బాబు ‘అతడు’ మువీ చూశారా? అందులో మహేశ్ ప్రొఫెషనల్ కిల్లర్. పాపం.. చేయని హత్యకు పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో రైల్లో ఓ వ్యక్తి పరిచయం అవడం.. పోలీసుల ఛేజింగ్‌లో అతడు రైల్లోనే చనిపోవడం.. అతడి బ్యాగ్ తీసుకుని చిన్నప్పుడు ఇంటి నుంచి పారిపోయిన పార్దుగా ఓ ఇంటికి వెళ్లడం.. మొత్తానికి కథ ఇదే. తాజాగా ఓ వ్యక్తి ‘అతడు’ మువీ 10, 20 సార్లైనా చూశాడేమో.. మహేశ్ క్యారెక్టర్‌లో దూరి వరుస చోరీలకు పాల్పడసాగాడు. అందుకు స్కెచ్‌లు వేశాడు సామీ.. అబ్బో అదిరిపోయిందిలే. ఇతగాడి నేర చిట్టా మీరే చూడండి..
40 యేళ్ల వయసులో ఉన్న ఓ వ్యక్తి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. చిన్నప్పుడే ఎవరో ఎత్తుకెళ్లారని, అయినవాళ్లకు దూరమై నానా అగచాట్లు పడ్డానని కన్నీరుమున్నీరయ్యాడు. అంతేనా.. తన కుటుంబాన్ని ఎలాగైనా వెతికిపెట్టమని పోలీసుల కళ్లావేళ్లాపడ్డాడు. దీంతో చలించిపోయిన పోలీసులు మీడియాలో ప్రకటనలు ఇచ్చారు. ఓ కుటుంబం అతడి కోసం స్టేషన్‌కు వచ్చింది. ఢిల్లీ, షాహిబాబాద్‌లో స్కూల్ నుంచి ఇంటికి సోదరితో కలిసి వెళ్తుండగా ఏడేళ్ల రాజును ఎవరో కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లారు. దీంతో సోదరి కుటుంబ సభ్యులకు తెల్పిగా వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఊరంతా జల్లెడ పట్టినా లాభం లేకపోయింది. కిడ్నాపర్ల నుంచి ఎలాంటి డిమాండ్ రాకపోవడంతో పోలీసులు క్రమంగా ఆ కేసును పక్కనపెట్టేశారు. 30 ఏళ్ల తర్వాత వచ్చిన ఆ కొత్త వ్యక్తి తానే రాజునని కిడ్నాప్ కథ చెప్పడంతో.. రాజు కుటుంబం ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. అయితే వారి ఆనందం పట్టుమని పక్షం రోజులు కూడా నిలివలేదు. కొడుకునని వచ్చిన సదరు కొత్తవ్యక్తిని దొరకపట్టి మళ్లీ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. తమ ఇంటికి వచ్చినప్పటి నుంచి అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్నాడని, మూడు రోజులకే పారిపోవడానికి యత్నించగా.. కుటుంబ సభ్యులు దొరకబట్టుకుని ఘజియాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనుమానంతో డీఎన్‌ఏ టెస్ట్ చేస్తే అసలు విషయం బయటపడింది. దీంతో పోలీసులు తమదైన స్టైల్‌లో విచారించగా నకిలీగాడి గుట్టు తెలిసింది.
गाजियाबाद में 30 साल पहले अगवा हुआ बेटा लौटा था घर, वो निकला धोखेबाज, इस तरह का अपराध कई बार कर चुका है; परिवारों को बताया कि वो उनका लापता परिजन है #Ghaziabad #Police #GhaziabadPolice #kidnapped #lostrelative @ghaziabadpolice #imposter #Jantv_BM #jantvdigital #jantvreel pic.twitter.com/gcnPLT77lU
— JAN TV (@JANTV2012) December 7, 2024
రాజస్థాన్‌కు చెందిన ఇంద్ర రాజ్ మేఘ్వాల్ (40) చిన్నతనం నుంచే నేరాలు చేయడంతో దిట్ట. ఎన్నో చోట్ల చోరీలు చేస్తూ కాలం వెళ్లదీశాడు. అయితే గత 20 ఏళ్లుగా తన ఐడెంటిటీని మార్చుకుంటూ కొత్త స్టైల్‌లో నేరాలకు పాల్పడసాగాడు. పలు స్టేషన్లలో పోలీసులను ఆశ్రయించి చిన్నతనంలో తనను ఎవరో కిడ్నాప్ చేశారని, తన కుటుంబాన్ని గుర్తించాలని ఎమోషనల్ డ్రామాలు ఆడేవాడు. దీంతో కరిగిపోయి వాళ్లు ప్రకటన ఇవ్వగా పలు కుటుంబాలు స్టేషన్కు వచ్చేవి. వారిలో యాదృచ్ఛికంగా ఏదో ఒక కుటుంబాన్ని సెలక్ట్ చేసుకుని వారి ఇంట్లో తిష్టవేస్తాడు. ఆ తర్వాత అదను చూసి ఇంట్లోని నగదు, బంగారంతో ఉడాయించేవాడు. అలా ఇప్పటివరకు 9 కుటుంబాలను మోసగించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 2024 జులై నుంచి ఆశా శర్మ అనే వ్యక్తి ఇంట్లో 4 నెలలు, 2023 జూన్ నుంచి సికార్‌లోని ఓ కుటుంబంలో 2 నెలలు, 4 ఏళ్ల క్రితం శ్రీగంగానగర్‌లో 2 నెలలు, మేఘ్వాల్ రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో 3 నెలలు ఇలా పలు చోట్ల చిన్నతనంలో కిడ్నాపైన కొడుకునని ఎమోషనల్ డ్రామాలు ఆడేవాడని ట్రాన్స్-హిండన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ నిమిష్ పాటిల్ మీడియాకు వివరాలు తెలిపాడు.