AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: జైల్లో ఖైదీ విచిత్ర ప్రవర్తన.. ఆస్పత్రికి తీసుకెళ్లి బాడీ ఎక్స్ రే తీయగా..

అధికారులకు జైల్లో ఫోన్ ఛార్జర్ కనిపించింది. ఎవరో మొబైల్ యూజ్ చేస్తున్నారని భావించి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. కానీ ఏం దొరకలేదు. ఓ ఖైదీ ప్రవర్తన తేడాగా ఉండటంతో...

Viral: జైల్లో ఖైదీ విచిత్ర ప్రవర్తన.. ఆస్పత్రికి తీసుకెళ్లి బాడీ ఎక్స్ రే తీయగా..
X Ray
Ram Naramaneni
|

Updated on: Dec 07, 2024 | 1:33 PM

Share

జైలు అంటే క్రిమినల్స్ ఉండే ప్లేస్. అక్కడ కట్టుదిట్టమైన భద్రత.. పూర్తి స్థాయి నిఘా ఉంటుంది. ఎవరైనా లోపల ఉన్న తమ వాళ్లను ముందుస్తు దరఖాస్తు పెట్టుకోవాలి. ఇక జైల్లో ఖైదీలకు కఠిన నియమ నిబంధనలు ఉంటాయి. అయితే  ఓ ఖైదీ దగ్గర మొబైల్ ఉండడాన్ని చూసి జైలు అధికారులు కంగుతిన్నారు. అంతేకాకుండా అతడు దాచిపెట్టిన తీరు చూసి అధికారులు కంగుతిన్నారు. ఈ ఘటన గుజరాత్‌లోని భావ్‌నగర్ జైల్లో వెలుగుచూసింది.

రవి బరయ్య(33) అనే ఖైదీ పోక్సో కేసులో అరెస్ట్ అయి.. ఈ ఏడాది అక్టోబర్ 19 నుంచి గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లా జైల్లో ఉంటున్నాడు. జైలు లోపల ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ అనుమతి ఉండదు. అయితే డిసెంబర్ 4న తనిఖీల సమయంలో..  మొబైల్ ఫోన్ ఛార్జర్‌ కనిపించడంతో అధికారులకు డౌట్ వచ్చింది. ఖైదీలు అందరి వద్ద వెతికినా ఫోన్ దొరకలేదు. అయితే రవి బరయ్యపై అనుమానంతో అతడి సెల్ అంతా గాలించినా ఫోన్ దొరకలేదు. అయినా అతనిపై అనుమానం పోలేదు. వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లి రవికి బాడీ ఎక్స్‌-రే తీయించారు. స్కానింగ్‌లో మల ద్వారంలో మొబైల్‌ ఉన్నట్లుగా తేలింది. దీంతో అధికారులు నివ్వెరపోయారు. ఘటనపై జైలు అధికారులు ఫిర్యాదు చేయగా.. BNS 223, ఖైదీల చట్టంలోని సెక్షన్ 42, 43,  45(12)ల కింద కేసు నమోదు చేశారు.

నిషేధిత మొబైల్ ఫోన్, ఛార్జర్ జైల్లోకి ఎవరు తీసుకొచ్చారు. రవి ఎంతకాలంగా ఫోన్ వినియోగిస్తున్నాడు అనే విషయాలపై జైలు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..   

Follow Us
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
ఆ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా.. ధురంధర్ డైరెక్టర్ నోట ప్రభాస్ మాట
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
ఆగని తుమ్ములతో అస్పత్రికొచ్చిన మహిళ.. డాక్టర్లు టెస్టులు చేయగా
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
దేశవ్యాప్తంగా భయోత్పాతానికి భారీ ఉగ్ర కుట్ర..!
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
యూట్యూబ్ ఛానెల్..ఒక్క ట్రిక్‌తో రాత్రికి రాత్రే లక్షల్లో వ్యూస్..
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
సిక్ లీవ్ అడిగినందుకు మేనేజర్‌ పైత్యం.. ఏకి పారేస్తున్న నెటిజన్లు
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
ఉతకకుండా కొత్త డ్రెస్‌లు వేసుకుంటున్నారా? జాగ్రత్త… ప్రమాదం మీకే!
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
కంఫర్ట్ జోన్.. మీ ఎదుగుదలను ఎలా నాశనం చేస్తుందో తెలుసా?
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ప్రజెంట్ టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!
జాతి వైరం మరిచిన గోమాత, కుక్క స్నేహానికి హాట్సాఫ్..!