Telugu News Trending Former BJP MLA said that whoever is involved in cow slaughter should be killed mercilessly Telugu News
Viral: గో హత్యకు పాల్పడితే చంపేయండి.. మీకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నా.. మాజీ ఎమ్మెల్యే కామెంట్స్ వైరల్
దేశంలో మత ఘర్షణలు, అల్లర్లపై రాజకీయ కామెంట్లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వీటినే ప్రధాన అజెండాగా పలు పార్టీలు ప్రజల్లోకి వెళ్తండటం ఆందోళన కలిగిస్తుంది. అయితే గో హత్యలు, గో రక్షణ విధానాలు కూడా తమ ప్రభావాన్ని...
దేశంలో మత ఘర్షణలు, అల్లర్లపై రాజకీయ కామెంట్లు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వీటినే ప్రధాన అజెండాగా పలు పార్టీలు ప్రజల్లోకి వెళ్తండటం ఆందోళన కలిగిస్తుంది. అయితే గో హత్యలు, గో రక్షణ విధానాలు కూడా తమ ప్రభావాన్ని చాటుకుంటున్నాయి. పొటిలికల్ (Politics) లీడర్స్ వీటినీ వదలడం లేదు. ఈ క్రమంలో బీజేపీ మాజీ ఎమ్మె్ల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోహత్యలకు ఎవరైనా పాల్పడితే వారిని నిర్దాక్షిణ్యంగా చంపేయాలని పార్టీ నేతలు, గ్రామస్థులకు చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అయింది. గో హత్యలకు పాల్పడిన వారిలో ఇప్పటికే ఐదుగురిని చంపేశామని, గోవుల జోలికి వస్తే ఎలాంటి వారినైనా వదిలిపెట్టబోమని, వారి అంతు చూస్తామని చెప్తుండడం ఆందోళన కలిగిస్తోంది. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే జ్ఞాన్ దేవ్ అహూజా (Gnan dev Ahuja) తన అనుచరులతో ఈ వ్యాఖ్యలు చేశారు. గో హత్యలకు పాల్పడిన వారిని చంపేసేందుకు మీకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నా, ఈ కేసులో అరెస్టై జైలుకు వెళితే.. వారిని బెయిల్ పై విడుదల చేసి బయటకు తీసుకొచ్చే బాధ్యత తమది అని చెప్పడం గమనార్హం. అంతే కాకుండా అలా జైలుకెళ్లి వచ్చిన వారిని నిర్దోశులుగా ప్రకటిస్తామని చెప్తుడంటం విశేషం.
“अब तक 5 हमने मारे हैं…कार्यकर्ताओं को खुली छूट दे रखी है..मारो **** को..ज़मानत हम करवाएँगे” ये शब्द राजस्थान भाजपा कार्यकारिणी के सदस्य और पूर्व विधायक ज्ञानदेव आहूजा के हैं।
కాగా.. గో అక్రమ రవాణా పేరుతో 2017, 2018లో రెండు హత్యలు జరిగాయి. 2019 వరకు ఆ హత్యలు జరిగిన ప్రాంతంలో జ్ఞాన్ దేవ్ అహూజానే ఎమ్మెల్యే కావడం గమనార్హం. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఆయన మత విశ్వాసాలను రెచ్చగొడుతున్నారంటూ పలువురు కేసులూ పెట్టారు. దీంతో ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి. మాజీ ఎమ్మెల్యే ప్రకటనపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. బీజేపీ దుర్మార్గాలకు పాల్పడుతోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన బీజేపీ.. అవి అహూజా సొంత మాటలని, వాటితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఈ మేరకు అల్వార్ యూనిట్ భాజపా చీఫ్ సంజయ్ సింగ్ పేర్కొన్నారు.