Video Viral: గర్ల్ ఫ్రెండ్ కు హీరోయిజం చూపించాలనుకున్నాడు.. బైక్ ఎక్కించుకుని రైడ్ కు బయల్దేరాడు.. కట్ చేస్తే దిమ్మతిరిగిపోయింది
నేటి తరం యువతకు బైకులపై (Bike) ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. వారి చేతిలో బండి ఉంటే చాలు రయ్ రయ్ మంటూ దూసుకెళ్తారు. ప్రమాదకర స్టంట్స్ చేస్తూ రెచ్చిపోతుంటారు. ఇలాంటి వీడియోలు మనం ఇది వరకు ఎన్నో...
నేటి తరం యువతకు బైకులపై (Bike) ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. వారి చేతిలో బండి ఉంటే చాలు రయ్ రయ్ మంటూ దూసుకెళ్తారు. ప్రమాదకర స్టంట్స్ చేస్తూ రెచ్చిపోతుంటారు. ఇలాంటి వీడియోలు మనం ఇది వరకు ఎన్నో చూశాం. అయితే చేతిలో బైక్ ఉన్న సమయంలో తనకు నచ్చిన అమ్మాయి చెంత ఉంటే.. ఆహా.. ఆ ఊహే ఎంత బాగుందో కదూ. వారిని బండి ఎక్కించుకుని డుగ్గుడుగ్గుమని లాంగ్ డ్రైవ్ కి వెళ్లిపోతారు. మెరుపు వేగంతో దూసుకెళ్లిపోతారు. బ్యాక్ సీట్ పై అమ్మాయి కూర్చుందంటే ఇక మనోళ్లు ఆగుతారా చెప్పండి. తామే హీరోలమని ఫీలయిపోతుంటారు. తమ ప్రతాపం చూపించాలని ఉవ్విళ్లూరిపోతారు. అందుకు ప్రమాదకర స్టంట్స్ కూడా చేస్తుంటారు. ఇవి కొన్ని సార్లు ఆనందం కలిగిస్తే మరికొన్ని మాత్రం ఆందోళన కలిగిస్తుంది. అంత వేగంగా బండి నడుపుతున్న సమయంలో ఆకస్మాత్తుగా జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే.. ఊహించుకోవడానికే కష్టంగా ఉంది కదూ. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో (Social Media) వైరల్ గా మారింది.
బైక్ పై ఓ యవకుడు తన ప్రియురాలితో కలిసి వెళ్తుంటాడు. వెళ్తూ వెళ్తూ ఒక్కసారిగా బండి వేగం పెంచుతాడు. అంతటితో ఆగకుండా తన హీరోయిజాన్ని చూపించాలనుకుని స్టంట్స్ చేస్తాడు. ఇక్కడే తన ప్లాన్ బెడిసి కొట్టింది. బైక్ ఒక్కసారిగా అదుపుతప్పి బొక్కబోర్లా పడింది. బండి నడుపుతున్న యువకుడు, అతని ప్రియురాలు వేగంగా కారులో పడిపోవడాన్ని ఈ వీడీయోలో చూడొచ్చు. ఈ షాకింగ్ ఇన్సిడెంట్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో పోస్ట్ అయింది. వీడియోను చాలా మంది లైక్ చేస్తుండగా.. మరికొంత మంది తమ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో పంచుకుంటారు.