Viral: ఫార్మాసిస్టు తెలివికి నెటిజన్లు ఫిదా.. ట్యాబ్లెట్ షీట్ కాదండోయ్.. పెళ్లి పత్రికే..

పెళ్లి (Marriage) .. జీవితంలో ఒకేసారి జరిగే అపురూప వేడుక. బంధువుల కోలాహాలు, ఆప్యాయతల పలకరింపులు, విందు భోజనాలు, ముత్యాల పందిళ్లల్లో అంగరంగ వైభవంగా నిర్వహించే వివాహ క్రతువును ఘనంగా నిర్వహించుకోవాలని ప్రతి ఒక్కరూ కలలుగంటారు....

Viral: ఫార్మాసిస్టు తెలివికి నెటిజన్లు ఫిదా.. ట్యాబ్లెట్ షీట్ కాదండోయ్.. పెళ్లి పత్రికే..
Marriage
Follow us
Ganesh Mudavath

|

Updated on: Aug 21, 2022 | 6:22 AM

పెళ్లి (Marriage) .. జీవితంలో ఒకేసారి జరిగే అపురూప వేడుక. బంధువుల కోలాహాలు, ఆప్యాయతల పలకరింపులు, విందు భోజనాలు, ముత్యాల పందిళ్లల్లో అంగరంగ వైభవంగా నిర్వహించే వివాహ క్రతువును ఘనంగా నిర్వహించుకోవాలని ప్రతి ఒక్కరూ కలలుగంటారు. తమ పెళ్లి వేడుక అన్నింటికంటే భిన్నంగా నిలిచిపోవాలనుకుంటారు. అందుకు తగ్గట్టే జాగ్రత్తలు తీసుకుంటారు. ఏ పెళ్లిలోనూ జరగని పద్ధతులను పాటిస్తారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పెళ్లి శుభలేఖ గురించి. ఇది లేకుంటే అసలు వివాహ వేడుకకు అర్థమే లేదని చెప్పవచ్చు. అంతటి ప్రాధాన్యత కలిగిన శుభలేఖల్లో ఇప్పటివరకు చాలా వెరైటీలు వచ్చాయి. భారీ సైజులోనో, క్రెడిట్‌ కార్డు సైజులోనో ముద్రిస్తున్నారు. కానీ తమిళనాడుకు (Tamil Nadu) చెందిన ఓ వ్యక్తి మాత్రం ఎవరూ చేయలేని విధంగా పెళ్లి కార్డును తయారు చేయించాడు. తాను వైద్య వృత్తి చేస్తుండటంతో అందుకు తగ్గట్లే ఏదైనా చేయాలనుకున్నాడు. టాబ్లెట్‌ షీట్‌ రూపంలో పెళ్లి కార్డు ముద్రించి బంధువులకు పంచి పెట్టాడు. ఈ శుభలేఖ ఫొటోలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

ఈ పెళ్లి కార్డును చూసిన వారు టాబ్లెట్‌ షీట్‌ అనే అనుకుంటారు. కానీ తేరిపాక చూశాక కానీ అసలు విషయం తెలియదు. టాబ్లెట్‌ షీట్‌లో మందు పేరు చోట వధూవరుల పేర్లు ముద్రించారు. ఎమ్మార్పీ, ఎక్స్‌పైరీ డేట్‌ ఉండాల్సిన చోట పెళ్లి తేదీ, వివాహం సమయం, విందు తదితర వివరాలను వేయించాడు. మానుఫాక్చర్డ్‌ బై అని ఉండాల్సిన చోట వధూవరుల తల్లిదండ్రుల పేర్లను ముద్రించి నవ్వులు పూయించాడు. వార్నింగ్‌ అన్న చోట స్నేహితులు, బంధువులు ఎవరూ పెళ్లికి మిస్‌ కావొద్దంటూ సరదా వార్నింగ్‌ ఇచ్చాడు. మొత్తానికి ఈ వెడ్డింగ్‌ కార్డు చూసిన నెటిజన్లు ఈ పిక్‌ను తెగ వైరల్‌ చేస్తున్నారు.