Watch: దారుణం.. ఫుడ్ డెలివరీ బాయ్‌పై హోటల్ సిబ్బంది దాడి.. వైరల్‌గా మారిన సీసీటీవీ ఫుటేజ్..
అతను జీవనోపాధి కోసం ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేసేవాడు. అతను ప్రతిరోజూ హోటళ్ల నుండి ఫుడ్ ఆర్డర్స్ స్వీకరించి ఇంటింటికీ వెళ్లి డెలివరీ చేసేవాడు. కానీ, అదేవృత్తి అతని పాలిట శాపంగా మారింది. ఫుడ్ ఆర్డర్ లేట్ చేసినందుకు హోటల్ సిబ్బందిని ప్రశ్నించిన పాపానికి అతను వారి చేతిలో దెబ్బలు తినాల్సి వచ్చింది. ఆర్డర్ ఆలస్యం అవుతుందని చెప్పిన కారణంగా హోటల్‌కు చెందిన కొంతమంది యువకులు అతనిపై దాడి చేశారు. ఏం జరిగింది..? ఎక్కడ జరిగింది..? ఎందుకు జరిగింది.. అనే వివరాల్లోకి వెళితే..

బెంగళూరు శివార్లలోని టి. దాసరహళ్లిలోని హీరఘట్ట రోడ్డులోని ఒక హోటల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. గత ఆదివారం ఫిబ్రవరి 2 రాత్రి స్విగ్గీకి ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న చిక్కసంద్ర నివాసి నవీన్ అనే యువకుడిపై హోటల్ సిబ్బంది దారుణంగా దాడి చేశారు. దాసరహళ్లిలోని గబ్రూ హోటల్ నుండి ఫ్రెండ్స్ క్లబ్‌లో ఫుడ్ ఆర్డర్ ఎందుకు ఆలస్యంగా డెలివరీ అవుతోందని కన్నడలో అడిగిన నవీన్‌తో హోటల్ సిబ్బంది వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే వారి మధ్య మాట మాట పెరిగింది. హోటల్ సిబ్బంది హఠాత్తుగా నవీన్‌పై దాడి చేశారు. ఈ వీడియోకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో స్థానిక కన్నడ అనుకూల సంస్థ కార్యకర్తలు దాడిని ఖండించారు. హోటల్‌ను మూసివేసి, నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. హోటల్ సిబ్బంది ఫుడ్ ఆర్డర్ విషయంలో ఆలస్యం చేసి, కన్నడ మాట్లాడినందుకు వారిపై దారుణంగా దాడి చేయడాన్ని ఖండించారు కన్నడ మాతృభాష ప్రేమికులు. ఈ సంఘటన సోలదేవనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కన్నడిగులకు క్షమాపణలు చెప్పాలని కన్నడ అనుకూల సంస్థల కార్యకర్తలు డిమాండ్ చేశారు.
Kannada guy : said order in Kannada, A Hindi shopkeeper attacked brutally food delivery guy in Bengaluru. Where we are heading towards? #kannada #karnataka pic.twitter.com/VauSf5caaw
— Karnataka Update (@about_karnataka) February 4, 2025
మొత్తం మీద, ఇటీవల పేద వేతన కార్మికులపై హింసాత్మక సంఘటనలు, మాటల దాడులు జరిగాయి. పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వచ్చాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..