Watch: కుంభమేళకు వచ్చి ఓ జంట చేసిన పనితో.. ఆగ్రహించిన సాధువులు ఏం చేశారంటే..

జనవరి 13న మహా కుంభమేళా ప్రారంభం కాగా, భారత్‌తో పాటు విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. ఇప్పటి వరకు 38 కోట్ల మంది కుంభమేళాకు వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. సామాన్య భక్తులతో పాటు అనేక మంది ప్రముఖులు కూడా కుంభమేళాకు హాజరై పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ప్రధాని మోదీ మహా కుంభమేళలో పాల్గొననున్నారు.

Watch: కుంభమేళకు వచ్చి ఓ జంట చేసిన పనితో.. ఆగ్రహించిన సాధువులు ఏం చేశారంటే..
Mahakumbh 2025
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 05, 2025 | 9:10 AM

మహాకుంభమేళా హిందువుల పవిత్ర పండుగ. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరుగుతోంది. ఈ కుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటున్నారు. అయితే, ఇక్కడ మాంసాహారం నిషేధించబడింది. అంతేకాదు.. మద్యం, సిగరెట్లు వంటి ఉత్పత్తులు కూడా ఇక్కడ అనుమతించబడవు. కానీ అలాంటి ప్రాంతంలో ఓ జంట చికెన్ వండే ప్రయత్నం చేశారు. పవిత్ర కుంభమేళాకు వచ్చి మాంసాహారం వండుతున్న ఆ దంపతుల గుడారాన్ని కూల్చివేసిన సాధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్‌ వీడియోలో చికెన్ వండిన జంటపై సాధువులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రయాగ్‌ రాజ్‌ ప్రాంతంలో టెంట్ వేసుకుని ఉంటున్న ఈ జంట చికెన్ వండుతుని తెలుసుకున్న సాధువులు వారి గుడారాన్ని తొలగించారు. వారిపై దాడి చేశారు. వారి ఆహారాన్ని కూడా పారబోశారు. పవిత్ర కుంభమేళాలో సాధువులు ఒక జంట చేయకూడని పని చేసినందుకు వారిని వెళ్ళగొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ జంట చర్యలపై నెటిజన్లు కూడా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

జనవరి 13న మహా కుంభమేళా ప్రారంభం కాగా, భారత్‌తో పాటు విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. ఇప్పటి వరకు 38 కోట్ల మంది కుంభమేళాకు వచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. సామాన్య భక్తులతో పాటు అనేక మంది ప్రముఖులు కూడా కుంభమేళాకు హాజరై పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 5న ప్రధాని మోదీ కుంభమేళలో పాల్గొంటారు. ఉదయం పది గంటలకు ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేస్తారు. మోదీ రాక నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్ నగరంతో పాటు కుంభమేళా వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..