AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: ఈ ఫోటోలో మీకు మొదట ఏం కనిపించిందో అదే మీ లవ్ లైఫ్ చెప్పేస్తుంది.. మీకు ఎలాంటి భాగస్వామిని కోరుకుంటారంటే.. ..

ఆప్టికల్ ఇల్యూషన్... మన కళ్లు చూసే విషయాలే మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. ఒక ఫోటోలో మీరు ముందుగా చూసేదే మీ లవ్ లైవ్

Optical Illusion: ఈ ఫోటోలో మీకు మొదట ఏం కనిపించిందో అదే మీ లవ్ లైఫ్ చెప్పేస్తుంది.. మీకు ఎలాంటి భాగస్వామిని కోరుకుంటారంటే.. ..
Optical Illusion
Rajitha Chanti
|

Updated on: Apr 22, 2022 | 10:05 PM

Share

ఆప్టికల్ ఇల్యూషన్… మన కళ్లు చూసే విషయాలే మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి. ఒక ఫోటోలో మీరు ముందుగా చూసేదే మీ లవ్ లైవ్ ఎలా ఉంటుంది.. మీ జీవిత భాగస్వామితో మీరేలా ఉంటారో తెలియజేస్తుంది. పైన ఫోటోలో మీరు ముందుగా ఏం చూశారు.. అదే మీ ప్రేమ జీవితాన్ని తెలియజేస్తుంది. ది మైండ్స్ జర్నల్ ప్రకారం ఈ ఆప్టికల్ భ్రమను అర్థం చేసుకోవడానికి ఐదు విభిన్న మార్గాలు ఉన్నాయి.. మీరు చూసేది మీరు సంబంధంలో వెతుకుతున్న లక్షణాలను తెలియజేస్తుంది. ముందుగా మీరు ఏం చూశారో అదే మీ జీవితం..

ఒక మనిషి ముఖం.. మీరు ముందుగా మనిషి ముఖం చూసినట్లయితే లవ్ లైఫ్ లో మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ది మైండ్స్ జర్నల్ ప్రకారం, మనిషి ముఖాన్ని చూసే వారు కష్టపడి పనిచేసే వ్యక్తులు.. అలాగే తమ ప్రియమైన వారిని గౌరవించడం, మెచ్చుకోవడం, ప్రశంసించడం కోసం ప్రయత్నిస్తారు. వీరి ఇతరులను నిశితంగా పరిశీలిస్తారు. వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరు మీ భాగస్వామికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అందుకే మీ దాంపత్య జీవితం ప్రశాంతంగా ఉంటుంది. మిమ్మల్ని ఇష్టపడే వారు ఎక్కువగా ఉంటారు.

మీరు మోసం చేసేవారు కాదు.. ఇతరుల పట్ల మీరు ఎంత ప్రశాంతంగా.. అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. మీ గురించి తెలియని వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడంలో విఫలమవుతారు. అయితే భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. మీరు ఎక్కువగా ఓపికగా ఉండాలి. మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ఇతరులకు సమయం ఇవ్వాలి.

కోటు వేసుకుని నిలబడి ఉన్న వ్యక్తి.. కోటు వేసుకుని నిలబడి ఉన్న వ్యక్తి ముందుగా చూసినట్లయితే మీరు మిమ్మల్ని అర్థం చేసుకునేవారి కోసం మీరు వెతుకుతున్నారని అర్థం. వీరు మనసులో ఎక్కువగా విచారంగా ఉంటారు. సంతోషం, విచారం మధ్య సమతుల్యతను గ్రహిం చడం అర్థవంతమైన ఉనికికి కీలకమని పేర్కోన్నారు. జీవితంలో ప్రతి విషయం మాదిరిగానే ప్రారంభమయ్యే సంబంధాలు కూడా తొందరగా ముగిసిపోతాయని అర్థం చేసుకుంటారు. వీరు తమకు ఇష్టమైన వారిని మనస్పూర్తిగా ప్రేమిస్తారు. జీవితం.. మరణం.. గురించి లోతైన అవగాహన విలువను.. అభినందించగల వారు.. అలాగే.. విచారంతో ఉన్న మనసును కూడా అందంగా చూడగలిగే వ్యక్తి మీకు రావాలి.

టేబుల్ మీద పడుకున్న పాప.. టేబుల్ మీద పడుకున్న పాపను మొదటి చూసినట్లయితే.. మీరు సాధారణంగా సంబంధాలను.. జీవితాన్ని కూడా నిస్సహాయంగా భావిస్తారు. వీరు ఎక్కువగా బాధ్యతతో ఉంటారు. ఏ సమయంలోనైనా తప్పు జరిగే అవకాశం ఉందని నమ్ముతారు. వీరు.. మందపాటి.. సన్నగా ఉండి.. జీవితాన్ని తక్కువ భారంగా భావించడంలో సహయపడే భాగస్వామిని కోరుకుంటారు. వీరు ఎక్కువగా ఆత్రుతగా.. ఒత్తిడికి గురవుతుంటారు. నిద్ర సరిగ్గా ఉండదు. ఎమోషనల్ అవుతుంటారు. మీరు మనస్పూర్తిగా మీ భాగస్వామిని ప్రేమించాలని వారు కోరుకుంటారు.

మిమ్మల్ని అర్థం చేసుకునే, మీ భావోద్వేగ అవసరాల గురించి తెలుసుకునే భాగస్వామి మీకు కావాలి. మీకు సురక్షితమైన, రక్షిత అనుభూతిని కలిగించే వ్యక్తి మీకు కావాలి. జీవితంలో మీకు మద్దతు ఇచ్చే వ్యక్తి కావాలి.

పుస్తకాలు చదువుతున్న వ్యక్తి.. టోపీలో రెండు పుస్తకాలు చదువుతున్న వ్యక్తిని ముందుగా చూస్తే.. మీకు జీవితంలో జరగబోయే విషయాలపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది..ఆధ్యాత్మిక సంబంధం ఉన్న భాగస్వామి కోసం వెతుకుతున్నారు. ఈ వ్యక్తులు వివిధ మతాలపై ఆసక్తిని కలిగి ఉంటారు, జీవితం పట్ల తమ ఉత్సుకతను పంచుకునే వారి పట్ల ఆకర్షితులవుతారు. వీరు ఆధ్యాత్మిక సంబంధాన్ని కోరుకుంటారు. మీరు మతపరమైన, ఆద్యాత్మిక విశ్వాసాలను పంచుకోకపోయినా.. మీ భాగస్వామితో మనస్పూర్తిగా అర్థవంతమైన బంధాన్ని పంచుకోవడం చాలా ముఖ్యం.

మీరు జీవితం, ప్రపంచం, విశ్వం, విభిన్న ఆధ్యాత్మిక అంశాల గురించి తెలుసుకోవడానికి ఇష్టపడే వ్యక్తుల పట్ల మీరు ఆకర్షితులవుతారు. ఆధ్యాత్మికత గురించి మీ ఉత్సాహాన్ని పంచుకునే భాగస్వామి మీకు కావాలి. అయితే వారు ఆధ్యాత్మికంగా ఉండకపోవచ్చు.

తెల్లటి దుస్తులు ధరించిన ఇద్దరు మహిళలు.. తెల్లటి దుస్తులు ధరించిన ఇద్దరు మహిళలను మీరు ముందుగా చూసినట్లయితే మీకు సవాలుగా భావించే భాగస్వామిని మీరు కోరుకుంటున్నారని అర్థం. వీరు స్త్రీల పట్ల ఎక్కువగా ఆకర్షితులు అవుతున్న మొండి పట్టుదలతో తమపై.. తమ జీవితం పట్ల నియంత్రణ కలిగి ఉంటారని జర్నల్ నివేదిక పేర్కోంది. ప్రతి ఒక్కరు మిమ్మల్ని నమ్మి.. మీకు తెలిసిన విషయాలు మీరు ఎలా కోరుకుంటున్నారో.. మీరు అడిగినవాటికి సరిగ్గా చెప్తే.. జీవితం చాలా సులభంగా ఉందని నమ్ముతారు.

అయితే ఈ లక్షణాలు మిమ్మల్ని అహంభావిలా చేస్తుంది.. మీ పరిశీలనలు, అవగాహనలు, తీర్పులు, ఆలోచనలు, నమ్మకాలు, భావోద్వేగాల గురించి చాలావరకు అసలైనవే నిజమని నమ్ముతారు. అన్ని పరిస్థితులలోనూ మీరు తెలివిగా.. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.

మీ పట్ల విధేయతతో కాకుండా.. ప్రతి సమస్యను ఎదుర్కోనే .. సవాళ్లను ఎదుర్కోనే భాగస్వామిని కోరుకుంటారు. మీ భాగస్వామి మిమ్మల్ని నమ్మే విధంగా.. ప్రతి విషయంలోనూ మీకు మద్దతు ఇచ్చే విధంగా.. మీ అభిప్రాయాలను తెలుసుకోవాలని .. మిమ్మల్ని సవాలు చేయాలని కోరుకుంటారు.

మీ ముందు లొంగిపోయే భాగస్వామి కాకుండా.. మీ ముందు ధైర్యంగా నిలబడి..మిమ్మల్ని ఎదురించే భాగస్వామి కావాలి. మీ భాగస్వామి ఇద్దరూ దీర్ఘాకాలంలో ఎదగడానికి.. ఒకరికొకరు మద్దతు ఇవ్వగల.. సవాలు చేయగల భాగస్వామి కావాలని కోరుకుంటారు. ఇద్దరూ వినయంగా ఉండేందుకు ఇష్టపడరు.

Also Read: Samantha: నా మౌనాన్ని బలహీనత అనుకోవద్దు.. వైరలవుతున్న సమంత లేటేస్ట్ ట్వీట్..

Allu Arjun: పుష్పరాజ్ పై పొగడ్తలు కురిపించిన కేజీఎఫ్ 2 బ్యూటీ.. నేను మీ వీరాభీమానినంటూ..

Jersey Movie: జెర్సీ సినిమాపై ప్రశంసలు కురిపించిన న్యాచురల్ స్టార్.. మీ మంచి మనసే కారణమంటూ స్టార్ హీరో రిప్లై..

Health Tips: వేసవిలో వీటిని రాత్రంతా నానబెట్టి తింటే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.. అవెంటో తెలుసా..