Viral: ఎన్‌క్లోజర్‌లో పడిపోయిన చిన్నారి చెప్పు.. తీరా ఏనుగు ఏం చేసిందో చూస్తే ఫిదా కావాల్సిందే!
సోషల్ మీడియాలో ఎన్నో రకాల వైరల్ వీడియోలు తరచూ హల్చల్ చేస్తుంటాయి. వాటిల్లో కొన్ని నవ్విస్తే..
సోషల్ మీడియాలో ఎన్నో రకాల వైరల్ వీడియోలు తరచూ హల్చల్ చేస్తుంటాయి. వాటిల్లో కొన్ని నవ్విస్తే.. ఇంకొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో ఓ ఏనుగు చేసిన పనికి నెటిజన్లు విపరీతంగా ఇష్టపడుతున్నారు. ఈ ఘటన చైనా జూలో చోటు చేసుకోగా.. ప్రస్తుతం ఆ వీడియో ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్.
జూలోని ఏనుగులను చూస్తున్న సమయంలో అనుకోకుండా ఓ చిన్నారి చెప్పు ఎన్‌క్లోజర్‌లో పడిపోయింది. ఆ చెప్పును ఏనుగు తన తొండంతో తీసి ఆ చిన్నారికి అందించింది. అందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఆ ఏనుగు ప్రవర్తనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..
ఇది చదవండి: టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..