Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dwayne Bravo: ఇంటా.. బయటా అదే స్టెప్.. ‘శ్రీవల్లి’ మాయలో పడ్డ క్రికెటర్ బ్రావో..

టాలీవుడ్ స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప: ది రైజ్' సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా వైజ్ ఈ చిత్రం సత్తా చాటింది. ముఖ్యంగా పాటలు దుమ్ములేపుతున్నాయి. సామాన్య జనం మాత్రమే కాదు సెలబ్రిటీలు సైతం పుష్ప పాటలకు ఫిదా అవుతున్నారు.

Dwayne Bravo: ఇంటా.. బయటా అదే స్టెప్.. 'శ్రీవల్లి' మాయలో పడ్డ క్రికెటర్ బ్రావో..
Bravo Dance to Srivalli song
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 26, 2022 | 6:24 PM

Bravo Pushpa Walk: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం పుష్ప(Pushpa).  బన్నీ యాక్టింగ్, సుకుమార్(Sukumar) టేకింగ్ నెక్ట్స్ లెవల్ లో ఉండటంతో ఆడియోన్స్ ఫిదా అవుతున్నారు. ఎర్ర చందనం(Red Sandal)స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ గత నెలలో పాన్ ఇండియా లెవల్లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. సౌత్ లోనే కాకుండా.. నార్త్‏లోనూ కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. ముఖ్యంగా ఇందులో బన్నీ నటనకు దక్షిణాది ప్రేక్షకుల కంటే ఉత్తరాది ప్రేక్షకులు బాగా కనెక్ట్‌ అయిపోయారు. ఇక ఈ మూవీ పాటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిత్రంలోని అన్ని సాంగ్స్ చంద్రబోస్ రాశారు. ప్రతి పాటను జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలోని పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. విదేశీయులు సైతం పుష్ప పాటలకు స్టెప్పులేస్తున్నారు. ఇక ఇండియన్ క్రికెటర్స్ పుష్ప పాటలకు డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే శిఖర్ దావన్.. సురేష్ రైనా వంటివారు పుష్ప పాటలకు డ్యాన్స్ చేశారు. ఇక ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం  పుష్ప ది రైజ్ పాటలకు డేవిడ్ వార్నర్ తనదైన స్టైల్లో డాన్సులు చేసి ఆకట్టుకున్నారు. తను మాత్రమే కాకుండా.. తన కూతుర్లతోనూ పుష్ప పాటలకు డ్యాన్స్ చేయించారు వార్నర్. తాజాగా వెస్ట్ ఇండీస్ ఆల్-రౌండర్ బ్రావో పుష్ప పాటకు ఫిదా అయిపోయాడు. ముఖ్యంగా అతడికి శ్రీవల్లి పాట ఫీవర్ పట్టుకుంది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL)లో కొమిల్లా విక్టోరియన్స్‌తో జరిగిన పోరులో బ్రావో క్రికెట్ మైదానంలో తన డ్యాన్స్ టాలెంట్ చూపించాడు.  కాగా, ఈ లీగ్ లో ఫార్చూన్ బోరిషాల్ త‌ర‌ఫున బ్రావో ఆడుతున్నాడు. ఆ మ్యాచ్‌లో కొమిల్లా విక్టోరియా జ‌ట్టుతో త‌ల‌ప‌డ్డాడు. మహిదుల్ ఇస్లామ్‌ను ఔట్‌ చేసిన సందర్భంగా శ్రీవల్లి స్టెప్పులు వేశాడు.

మైదానంలోనే కాదు.. బయట కూడా బ్రావో ఇదే స్టెప్ తో నెటిజన్లను ఆకర్షిస్తున్నాడు. ‘గోయింగ్ విత్ ట్రెండ్’ అంటూ దుమ్మురేపాడు. సేమ్ బన్నీ మాదిరి గాగుల్స్ పెట్టుకుంటూ  స్టెప్ వేశాడు. ఆ వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేసి.. డేవిడ్ వార్నర్, సురేష్ రైనాలను తాను ఆ స్టెప్ ఎలా వేశానో చెప్పాలని పేర్కొన్నాడు. అయితే బ్రావో పోస్ట్ పై వార్నర్ స్పందించాడు. నవ్వుతున్న సింబల్స్ పోస్ట్ చేసిన వార్నర్.. నువ్వు లెజెండ్ అని పేర్కొన్నాడు. ఏది ఏమైనా పుష్ప సినిమా సాంగ్స్ ఇటు ప్రేక్షకులను మాత్రమే కాదు ఇంటర్నేషనల్ క్రికెటర్లను సైతం ఆకర్షించడం గర్వించదగ్గ విషయం.

Also Read: కోవిడ్ పాజిటివ్ మహిళకు ప్రసవం చేయడానికి వైద్యుల నిరాకరణ.. వారిపై సీరియస్ యాక్షన్