AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: అరరె ఎంతపనైంది.. పాపం మందుబాబు.. మద్యం సీసా కోసం వెళ్లి ఇలా ఇరుక్కుపోయాడు..!

ఆ తర్వాత అతడు పడ్డ అవస్థలు, బయటకు రావడానికి అతడు ప్రయత్నిస్తున్నట్లు వీడియో చూపిస్తుంది. అక్కడే ఉన్న ఇతర వ్యక్తులు అతని తల బయటకు వచ్చేలా గ్రిల్‌ను పట్టుకుని లాగడానికి ప్రయత్నిస్తున్నారు. చివరికి, అక్కడ ఉన్న వ్యక్తుల సహాయంతో అతని తల గ్రిల్ నుండి బయటకు వచ్చింది.

Watch: అరరె ఎంతపనైంది.. పాపం మందుబాబు.. మద్యం సీసా కోసం వెళ్లి ఇలా ఇరుక్కుపోయాడు..!
Drunk Mans
Jyothi Gadda
|

Updated on: Jul 19, 2025 | 9:32 PM

Share

మద్యానికి బానిసైన వారికి మద్యం దొరకలేదంటే పిచ్చెక్కిపోతారు. కొంతమంది దాని కోసం తమ ఇల్లు, భార్య, పిల్లలను కూడా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటారు. కానీ, మద్యానికి మాత్రం దూరంగా ఉండలేరు. అలాంటి ఒక మద్యపాన బానిస మద్యం పొందడానికి ఏం చేసాడో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. మూసివేసిన దుకాణం నుండి మద్యం బాటిల్ తీయడానికి ప్రయత్నిస్తుండగా, అతని మెడ ఇనుప గ్రిల్‌లో ఇరుక్కుపోయింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రజలు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు.

వైరల్‌ అవుతున్న ఈ వీడియో @jist.news అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ నుండి పోస్ట్ చేయబడింది. మద్యం బాటిల్ తీయడానికి ప్రయత్నించినప్పుడు ఒక వ్యక్తి తల మూసివేసిన దుకాణం గ్రిల్‌లో ఎలా ఇరుక్కుపోయిందో వీడియోలో కనిపిస్తుంది. మద్యం దొరక్కపోవటంతో తల్లడిల్లిపోయిన అతడు ఇలా ఇబ్బందులను తెచ్చుకున్నారు. అతడు మందుబాటిల్‌ కోసం ఇనుప గ్రిల్స్‌ మద్యలో తలదూర్చాడు. ఆ తర్వాత అతడు పడ్డ అవస్థలు, బయటకు రావడానికి అతడు ప్రయత్నిస్తున్నట్లు వీడియో చూపిస్తుంది. అక్కడే ఉన్న ఇతర వ్యక్తులు అతని తల బయటకు వచ్చేలా గ్రిల్‌ను పట్టుకుని లాగడానికి ప్రయత్నిస్తున్నారు. చివరికి, అక్కడ ఉన్న వ్యక్తుల సహాయంతో అతని తల గ్రిల్ నుండి బయటకు వచ్చింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Jist (@jist.news)

ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు, కానీ వీడియో మాత్రం నెట్టింట వైరల్ అవుతోంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. కొంతమంది ఇది నిజమైన మద్యం మత్తు అని అంటున్నారు. కొందరు గ్రిల్‌లో ఇరుక్కుపోయిన తర్వాత అతను బాటిల్‌ను సాధించాడా అని మరి కొందరు ప్రశ్నించారు. బాటిల్ పగలకుండా చూసుకుంటూ అతన్ని బయటకు తీయండి అంటూ ఇంకొందరు కామెంట్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
దరిద్రం తీరిపోయే సమయం వచ్చేసింది.. వీరికి మహాలక్ష్మి యోగం
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
మైక్రోవేవ్ ప్రాణాంతకమా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
మైక్రోవేవ్ ప్రాణాంతకమా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
చలితో బరువుతగ్గొచ్చట.. బ్రౌన్ ఫ్యాట్ సీక్రెట్ చెప్పిన సైంటిస్టులు
చలితో బరువుతగ్గొచ్చట.. బ్రౌన్ ఫ్యాట్ సీక్రెట్ చెప్పిన సైంటిస్టులు