Viral Video: కళ్లను మాయ చేసే ఎనిమిదో వింత.. వీడియో చూస్తే మీరూ నమ్మలేరు.!
కొన్నిసార్లు సోషల్ మీడియాలో కనిపించే ఫోటోలు, వీడియోలు మనల్ని అప్పుడప్పుడూ అబ్బురుపరుస్తుంటాయి. ఇలాంటివి తీయడంలో ఎంతోమంది..
కొన్నిసార్లు సోషల్ మీడియాలో కనిపించే ఫోటోలు, వీడియోలు మనల్ని అప్పుడప్పుడూ అబ్బురుపరుస్తుంటాయి. ఇలాంటివి తీయడంలో ఎంతోమంది కెమెరామెన్‌లు తమ కెమెరాలతో అద్భుతం చేస్తుంటారు. అందుకేనేమో అవి నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని చూసిన తర్వాత మీరు కూడా ‘ఎంత అద్భుతంగా ఉందో’ అంటూ ఆశ్చర్యపోతారు.
ఇజ్రాయెల్‌కు చెందిన డ్రోన్ ఫోటోగ్రాఫర్ లయర్ పటేల్ తన కెమెరాతో ఎనిమిదో వింతను సృష్టించాడు. 1000-1700 గొర్రెల మంద కదలికలను.. అవి మార్చుకుంటున్న దిశలను పైనుంచి(టాప్ యాంగిల్) డ్రోన్ కెమెరా సహాయంతో బంధించాడు. ఆ వీడియోలో గొర్రెల కదలికలను ఫాస్ట్ ఫార్వర్డ్.. స్లో మోషన్ యాంగిల్స్‌లో చూపించగా.. అవి ఒకసారి పాములా.. మరోసారి పక్షి ఆకారంలో కనిపించి అబ్బురపరుస్తున్నాయి. డ్రోన్ కెమెరాతో చేసిన ఈ అద్భుతం వీక్షకులను కనువిందు చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ వీడియో తీయడం వెనుక ఏడు నెలల కఠోర శ్రమ ఉందని ఫోటోగ్రాఫర్ లయర్ పటేల్ చెప్పుకొచ్చాడు.
”గత ఏడు నెలలుగా ఓ పెద్ద గొర్రెల మంద కదలికలను చిత్రీకరిస్తూ వచ్చాను. అవి ఒకే చోట కుదురుగా ఉండవు. వాటి వెనుకే తిరిగాను. శ్రమించి డ్రోన్ కెమెరాతో ఆ దృశ్యాలను బంధించాను. ఆ గొర్రెల మందలో సుమారు 1000 నుంచి 1700 గొర్రెలు ఉన్నాయి” అంటూ చెప్పుకొచ్చాడు. వీడియో ఫైనల్ కట్ చూసిన తర్వాత ఇంత అందంగా వస్తుందని అస్సలు ఊహించలేదని లయర్ పేర్కొన్నాడు. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అవుతోంది. దాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. వేలల్లో వ్యూస్, లైకులు వచ్చి పడుతున్నాయి.
Also Read:
ఈ ఫోటోలో మరో చిరుత దాగుంది.. కనిపెట్టగలరా! గుర్తు పట్టలేదా.? అయితే ఈ క్లూ ట్రై చేయండి..
బిర్యానీ ఇలా కూడా చేస్తారా! నెటిజన్లు ఫిదా.. వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే!
View this post on Instagram