Viral: నదిలో ఆహారం కోసం వెదుకుతున్న జీవి.. దానిని చూసి జంతు సంర‌క్షణ‌ అధికారులు షాక్‌!

అమెరికాలోని ఓ నదిలో డాల్ఫిన్‌ దర్శనమిచ్చింది. అది ఆహారం కోసం వెదుకుతూ నదిలో పైకి కిందికి ఎగురుతూ కనిపించింది. దానిని చూసి జంతు సంరక్షణ అధికారులు నదిలోకి డాల్ఫిన్‌ రావడమేంటని ఆశ్చర్యపోయారు. ఆ బేబీ...

Viral: నదిలో ఆహారం కోసం వెదుకుతున్న జీవి.. దానిని చూసి జంతు సంర‌క్షణ‌ అధికారులు షాక్‌!
Dolphin Video Viral
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jul 17, 2022 | 7:40 PM

అమెరికాలోని ఓ నదిలో డాల్ఫిన్‌ దర్శనమిచ్చింది. అది ఆహారం కోసం వెదుకుతూ నదిలో పైకి కిందికి ఎగురుతూ కనిపించింది. దానిని చూసి జంతు సంరక్షణ అధికారులు నదిలోకి డాల్ఫిన్‌ రావడమేంటని ఆశ్చర్యపోయారు. ఆ బేబీ డాల్ఫిన్‌ నదిలో ఎగురుతూ ఉన్న దృశ్యాన్ని వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. దాంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ బేబీ డాల్ఫిన్‌ లాంగ్ ఐలాండ్ సౌండ్ నుంచి కనెక్టికట్ నదిలోకి వ‌చ్చిన‌ట్లుగా అధికారులు గుర్తించారు. ముందుగా దీనిని థేమ్స్ నది వెంట మత్స్యకారులు గుర్తించారు. లాంగ్ ఐలాండ్ సౌండ్ నుంచి 15 మైళ్ల దూరంలో ఉన్న నార్విచ్ మెరీనా సమీపానికి ఇది ఈదుకుంటూ వ‌చ్చిన‌ట్లుగా అధికారులు భావిస్తున్నారు. దీన్ని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్‌తో కలిసి పర్యవేక్షిస్తున్నారు. డాల్ఫిన్ బాల్యద‌శ‌లో ఉంద‌ని అక్వేరియం యానిమ‌ల్‌ రెస్క్యూ టెక్నీషియన్ చెప్పారు. రక్షించాల్సిన అవసరం లేకుండానే అది చివరికి లాంగ్ ఐలాండ్ సౌండ్‌కు తిరిగి వెళ్లగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి