Viral Video: ఇతనే రియల్ భల్లాలదేవ.. శక్తినంతా ధారబోసి మేకపోతుతో తలపడి.. చివరకు
కరోనా మహమ్మారి తర్వాత అందరూ ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాయామం చేస్తున్నారు. జిమ్‌కు వెళ్లలేనివాళ్లు వాళ్లు వాళ్లకు అందుబాటులో ఉన్న పరికరాలతో వర్కౌట్స్ చేస్తున్నారు....
కరోనా మహమ్మారి తర్వాత అందరూ ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాయామం చేస్తున్నారు. జిమ్‌కు వెళ్లలేనివాళ్లు వాళ్లు వాళ్లకు అందుబాటులో ఉన్న పరికరాలతో వర్కౌట్స్ చేస్తున్నారు. ఓ ఆఫ్రికన్ తన ఫిట్‌నెస్‌ను పెంచుకునేందుకు వినూత్నంగా ఆలోచించాడు. ఈ క్రమంలో అతను ఓ మేకపోతుతో ఢీ కొడుతున్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఓ యూజర్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోలో ఒక పెద్ద బండపైన బలిష్టమైన ఓ మేకపోతు నిల్చుని ఉంది. కింద దాంతో తలపడే వ్యక్తి నిల్చుని ఉన్నాడు. ఇద్దరూ సై అంటే సై అన్నట్టు పోటీకి సిద్ధమయ్యారు. ఒకరి నొకరు తలతో బలంగా కుస్తీ పడుతున్నారు. ఆ వ్యక్తి తన శక్తినంతా ఉపయోగించి మేకను ఢీకొడుతున్నాడు. మరోవైపు మేక కూడా తగ్గేదే లేదంటూ అంతే బలంగా అతన్ని ఎదుర్కొంటుంది.
New neck training regimen just hit the block boys pic.twitter.com/7XfVV60AzJ
ఇవి కూడా చదవండి— KDOT ? (@KdotUntamed) March 24, 2022
దాదాపు 20 సెకన్లు సమఉజ్జీగా తలపడిన తర్వాత మేక ఆ వ్యక్తిని నెట్టేసింది. ఈ అద్భుతమైనా వీడియో ఇంటర్నెట్‌లో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. మేక స్టామినా చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. ఈ వీడియోను లక్షలమంది వీక్షిస్తూ లైక్స్‌తో కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. అద్భుతమైన వీడియో అని, రియల్ భల్లాలదేవ అని పొగిడేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరూ చూసేయండి.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి