Viral Video: నాకు జ్వరమోచ్చింది డాక్టరూ.. ఆసుపత్రి బెడ్‌పై హాయిగా నిద్రిస్తున్న కుక్క..

పేషెంట్స్ ఉండాల్సిన బెడ్ పై కుక్క నిద్రపోతుండడంతో నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ ఘటన

Viral Video: నాకు జ్వరమోచ్చింది డాక్టరూ.. ఆసుపత్రి బెడ్‌పై హాయిగా నిద్రిస్తున్న కుక్క..
Viral
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 17, 2022 | 9:11 AM

సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రతి చిన్న అంశం తెగ వైరల్ అవుతుంది. ఎక్కడ ఏం జరిగిన క్షణాల్లో నెట్టింట చక్కర్లు కొడుతుంది. అందుకు సంబంధించిన వీడియోస్.. ఫోటోస్ హల్చల్ చేస్తుంటాయి. తాజాగా ఆసుపత్రి బేడ్ పై ఓ శునకం హాయిగా నిద్రిస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. పేషెంట్స్ ఉండాల్సిన బెడ్ పై కుక్క నిద్రపోతుండడంతో నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‏లోని రత్లామ్ హాస్పిటల్‏లో జరిగినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఆందోళనకరమైన ఆరోగ్య వ్యవస్థ నెలకొందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

రాష్ట్రంలో ఆసుపత్రిలో డాక్టర్స్ లేకపోవడం.. పేషెంట్స్ ఉండాల్సిన బెడ్స్ పై కుక్కలు నిద్రపోతున్నాయి. ఇదే కదా ఆందోళనకరమైన ఆరోగ్య వ్యవస్థ.. సరైన బెడ్స్ లేక రోగులు నానా అవస్థలు పడుతున్నారంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.