AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: కోరి కొరివితో తల గోక్కున్నట్టు.. పడగవిప్పిన 3 నాగులతో పరాచకాలు.. ఇచ్చిపడేశాయ్‌గా

Snake: పాములు చాలా డేంజరస్. అందులో కోబ్రాల జోలికి వెళ్తే నిప్పుతో నేషనల్ గేమ్ ఆడినట్లే. అలానే ఓ యువకుడు 3 కోబ్రాలతో పరాచకాలు ఆడి ప్రమాదంలో పడ్డాడు.

Viral Video: కోరి కొరివితో తల గోక్కున్నట్టు.. పడగవిప్పిన 3 నాగులతో పరాచకాలు.. ఇచ్చిపడేశాయ్‌గా
Snakes Viral Video
Ram Naramaneni
|

Updated on: Sep 17, 2022 | 8:53 AM

Share

Trending: పామును డైరెక్ట్‌గా చూడటం సంగతి పక్కన పెట్టండి. ఫోన్‌లో స్నేక్ విజువల్ చూసినా.. ఇమేజ్ కనిపించినా కూడా భయపడే వాళ్లు ఉంటారు. కాగా ఈ మధ్య పాములకు సంబంధించిన రకరకాలు వీడియోలు సోషల్ మీడియా(Social media)లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కొంతమంది స్నేక్ క్యాచర్స్ అలవోకగా వాటిని బంధించిన వీడియోలు బహుళ ప్రజాదరణ చూరగొంటున్నాయి. అయితే పాములు పట్టే స్నేక్ క్యాచర్స్ కొందరు ఇటీవల అదే పాముకాటు బలైన విషాద ఘటనలు కూడా వెలుగుచూశాయి. తాజాగా ఒక వ్యక్తి ఒకే సారి 3 నాగుపాములను ఆడించేందుకు ట్రై చేసి.. ప్రమాదంలో పడ్డాడు. కర్ణాటకలో ఈ ఇన్సిడెంట్ జరిగినట్లు తెలుస్తుంది. మాములుగా అయితే పడగ విప్పిన ఒక కోబ్రాను మేనేజ్ చెయ్యడమే కష్టం. అది బుసలు కొడుతూ మీదకు దూసుకుని వస్తుంది. కానీ ఈ కర్ణాటక(Karnataka) కుర్రోడు.. మాజ్ సయ్యద్.. తన టాలెంట్ ఏంటో చూపేందుకు ఈ ప్రమాదకర స్టంట్ చేశాడు. ఒకేసారి 3 పడగవిప్పిన కోబ్రాలతో ఆటలాడాడు. వాటి ముందు కూర్చుని.. వాటిని అటూ, ఇటూ ఆడించాడు. ఇతగాడి ఓవర్ యాక్షన్ భరించలేకపోయిన ఓ స్నేక్.. రివర్స్ పంచ్ ఇచ్చింది. ఒక్కసారిగా అతడి మీదకు దూకి మోకాలిపై కాటు వేసింది. అతడు దాన్ని వదిలించుకునేందుకు చాలా కష్టపడ్డాడు. IFS సుశాంత్ నంద ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. పాములతో ఇలాంటి ఆటలు ఆడితే ప్రాణాలకే రిస్క్ అని పేర్కొన్నారు. ఇలాంటి ఆటలను పాములు తమకు ముప్పుగా భావించి అటాక్ చేస్తాయని వివరించారు. ప్రజంట్ ఈ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది.

వీడియో చూడండి….. 

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..