AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: తప్పుకోండి.. తప్పుకోండి.. గ్రామ సింహం వస్తోంది.. అడ్డోస్తే అంతే ఇక.. వీడియో

సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో వింత ఘటనలు తెరపైకి వస్తుంటాయి. తాజాగా.. ఓ శునకానికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవతోంది.. దీనిని చూసి నెటిజన్లు.. వారెవ్వా.. గ్రామ సింహమంటే ఇదేనంటూ పేర్కొంటున్నారు.

Watch Video: తప్పుకోండి.. తప్పుకోండి.. గ్రామ సింహం వస్తోంది.. అడ్డోస్తే అంతే ఇక.. వీడియో
Dog Viral Video
Shaik Madar Saheb
|

Updated on: Dec 04, 2022 | 1:06 PM

Share

సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో వింత ఘటనలు తెరపైకి వస్తుంటాయి. తాజాగా.. ఓ శునకానికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవతోంది.. దీనిని చూసి నెటిజన్లు.. వారెవ్వా.. గ్రామ సింహమంటే ఇదేనంటూ పేర్కొంటున్నారు. సాధారణంగా రోడ్లపై జరిగే ఎన్నో వింత ఘటనలను మనం చాలాసార్లు చూస్తుంటాం.. చూసిన తర్వాత ఆశ్చర్యపోతుంటాం. ఇవి చూడటానికి ఫన్నీగా ఉంటుంది. తాజాగా.. అచ్చం అలాంటి వీడియో ఒకటి.. నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. కారు పైన ఒక కుక్క.. నిలబడి దర్జాగా ప్రయాణిస్తూ కనిపించింది. ఇది చూసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే.. కదిలే కారుపై ప్రయాణించే కుక్కను ఇప్పటి వరకు ఎవరూ చూడలేదు. అందుకే ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియోలో నవాబీ అనే కుక్క స్వారీ చేస్తూ కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఈ కుక్క వచ్చిరాగానే సంచలనంగా మారింది. చాలా మంది షేర్ చేస్తూ.. అసలైన గ్రామసింహం అంటే ఇదేనంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక వీధిలో కారు వెళుతుండటాన్ని మీరు చూడవచ్చు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. కారులోపల ప్రజలు కూర్చొని ఉండగా.. ఓ కుక్క కారు రూఫ్‌పై దర్జాగా నిలబడి అంతా గమనిస్తూ ఉంటుంది. ఈ ప్రయాణంలో కుక్క భయపడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే, కుక్క కారుపై ఉండగా.. కారును డ్రైవ్ చేస్తూ కనిపించారు. ఈ క్రమంలో అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

జానీలాల్ అనే యూజర్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. వేలాది మంది వీక్షించి లైక్ చేస్తున్నారు. కొందరు గూండా శునకం అంటూ కామెంట్ చేస్తుండగా.. మరికొందరు శునకం శైలి అదిరిపోయిందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకా నయం కుక్క భయంతో కిందకు దూకితే పరిస్థితి ఏంటంటూ మరికొందరూ పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..