AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Cop: బైక్ మీద వెళ్తున్న దొంగను పట్టుకోవడానికి ప్రాణాలను లెక్కచేయని పోలీసు సాహసం.. రియల్ హీరో అంటున్న నెటిజన్లు..

ఓ చైన్ స్నాచర్ మహిళ గొలుసును లాక్కెళ్లినట్లు పోలీస్ స్టేషన్ కు సమాచారం అందింది. ఈ విషయం తెలిసిన వెంటనే కానిస్టేబుల్ సత్యేంద్ర దొంగ కోసం వెతకడం ప్రారంభించాడు. ఇంతలో ముఖం మీద రుమాలు కట్టుకుని ఉన్న ఓ బైక్ రైడర్ ను సత్యేంద్ర చూశాడు.

Delhi Cop: బైక్ మీద వెళ్తున్న దొంగను పట్టుకోవడానికి ప్రాణాలను లెక్కచేయని పోలీసు సాహసం.. రియల్ హీరో అంటున్న నెటిజన్లు..
Delhi Constable Risks His Life
Surya Kala
|

Updated on: Nov 26, 2022 | 10:09 AM

Share

దొంగలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. కొంత మంది తాము దొంగిలించడానికి వింత పద్ధతులను అవలంబిస్తారు. కొన్ని సార్లు దొంగలను ఎన్ని ఏళ్ళు అయినా పట్టుకోలేరు కూడా.  పట్టపగలే అందరూ చూస్తుండగానే కొంతమంది.. ఎటువంటి భయం లేకుండా దొంగతనం చేస్తారు. అయితే అదృష్టం అన్నిసార్లు దొంగలవైపే ఉండదు. ఒకొక్కసారి.. దొంగలను దురదృష్టం వెంటాడి.. పోలీసులకు పట్టిస్తుంది కూడా.. అలాంటి ఓ దొంగ వీడియో  ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ పోలీసు తన ప్రాణాలను పణంగా పెట్టి దొంగను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు.

వైరల్ అవుతున్న వీడియో ఢిల్లీలోని షహబాద్ డెయిరీ ప్రాంతానికి సంబంధించినది. ఢిల్లీకి చెందిన పోలీసు కానిస్టేబుల్ తన ప్రాణాల లెక్క చేయకుండా  కదులుతున్న బైక్‌పై నుండి దొంగను పట్టుకున్నాడు. ఓ చైన్ స్నాచర్ మహిళ గొలుసును లాక్కెళ్లినట్లు పోలీస్ స్టేషన్ కు సమాచారం అందింది. ఈ విషయం తెలిసిన వెంటనే కానిస్టేబుల్ సత్యేంద్ర దొంగ కోసం వెతకడం ప్రారంభించాడు. ఇంతలో ముఖం మీద రుమాలు కట్టుకుని ఉన్న ఓ బైక్ రైడర్ ను సత్యేంద్ర చూశాడు. ఓ వ్యక్తి తన ముఖాన్ని రుమాలుతో కప్పుకున్నాడు.. తనకు ఎదురుగా ఉన్న పోలీసులను చూసి భయపడడం మొదలు పెట్టాడు. దీంతో కానిస్టేబుల్ సత్యేంద్రకి ఆ వ్యక్తిపై అనుమానం పెరగడంతో…  వెంటనే ఆ బైక్ రైడర్‌ని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అయితే అలా వెళ్తుండగా బ్యాలెన్స్ తప్పి బైక్ కింద పడిపోయింది. అయినప్పటికీ సత్యేంద్ర పట్టుదల విడవకుండా.. ధైర్యంగా వెంటాడి బైక్ రైడర్‌ను పట్టుకున్నాడు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియోలో.. చైన్ స్నాచర్ పోలీసులకు పట్టుబడ్డాడు. అతను తనను తాను పోలీసు చేతి నుంచి విడిపించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాడు.. అయితే కానిస్టేబుల్ పట్టు నుండి తనను తాను విడిపించుకోలేకపోయాడు. అయితే ఈ సమయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా ఆ పోలీసు గాయపడి ఉండేవాడని వీడియో చూస్తే ఎవరికైనా అర్ధం అవుతుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఢిల్లీ పోలీసులు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన వారంతా ఈ కానిస్టేబుల్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నువ్వు రియల్ హీరో అంటూ కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..