AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tourist Dance: నేపాల్ లో సందడి చేసిన విదేశీ యువతి.. బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ కు ఓ రేంజ్ లో డ్యాన్స్

ఈ విదేశీ మహిళ డ్యాన్స్ కు స్థానికులు  ఈలలు,  చప్పట్లు కొట్టడం ప్రారంభించి.. ప్రోత్సహించారు. ఈ వీడియో చూసిన తర్వాత, మీరు కూడా ఆ విదేశీ మహిళకు అభిమాని అవుతారు.

Tourist Dance: నేపాల్ లో సందడి చేసిన విదేశీ యువతి.. బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్ కు ఓ రేంజ్ లో డ్యాన్స్
Foreign Tourist Dance
Surya Kala
|

Updated on: Nov 24, 2022 | 10:01 AM

Share

భారతీయుల సినిమాలు, పాటలకు క్రేజ్ ఎల్లలు దాటి.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంటుంది. బాలీవుడ్ సినిమాలు , పాటల క్రేజ్ ఇప్పుడు మనదేశానికి మాత్రమే పరిమితం కాలేదు.. అనేక దేశాల ప్రజలు మన బీట్ కు ఫిదా అవుతున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలు ఇతర దేశాల్లో సంచలన విజయాన్నీ నమోదు చేస్తూ.. భారీ వసూళ్లను రాబడుతున్నాయి. ఇలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. మరోవైపు బాలీవుడ్ సూపర్‌హిట్ పాటల క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో.. విదేశీయులు కూడా బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేస్తూ  క్యూట్ క్యూట్  ఎక్స్‌ప్రెషన్స్‌తో నెటిజన్ల మనసు దోచుకుంటున్నారు. ప్రస్తుతం ఇద్దరు విదేశీ మహిళల వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇందులో ఇద్దరు మహిళలు ‘సింబా’ చిత్రంలోని సూపర్‌హిట్ పాట ‘ ఆంఖ్ మారే’కు అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నారు.

ఈ వీడియో నేపాల్ లో షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ దేశంలోని ఒక మహిళా పర్యాటకురాలు తన అద్భుతమైన డ్యాన్స్ తో ప్రజల హృదయాలను గెలుచుకుంది. అదే సమయంలో, ఈ వీడియో ఇంటర్నెట్ ప్రపంచంలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. ఈ విదేశీ మహిళ డ్యాన్స్ కు స్థానికులు  ఈలలు,  చప్పట్లు కొట్టడం ప్రారంభించి.. ప్రోత్సహించారు. ఈ వీడియో చూసిన తర్వాత, మీరు కూడా ఆ విదేశీ మహిళకు అభిమాని అవుతారు. ఒక స్థానిక మహిళ కూడా విదేశీ పర్యాటకురాలితో కలిసి నృత్యం చేస్తూ కనిపించింది. ఆమె డ్యాన్స్ స్టైల్ కూడా అద్భుతంగా ఉంది.

ఇవి కూడా చదవండి

బాలీవుడ్ లో సూపర్ హిట్ సాంగ్ ‘ఆంఖ్ మారే’కి రీమేక్.  సంగీత దర్శకుడు విజు షా స్వరపరచగా, కుమార్ సాను , కవితా కృష్ణమూర్తి పాడారు. అర్షద్ వార్సీ , సిమ్రాన్‌లు హీరో హీరోయిన్లుగా నటించిన తేరే మేరే సప్నేలో సినిమాలోని సాంగ్ ..  1996 లో విడుదలైంది.

ఈ వీడియో టిక్‌టాక్ నేపాలీ అనే ఖాతా నుండి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయబడింది. ఈ వీడియోకు దాదాపు 40 వేల లైక్స్ ను , 6 లక్షలకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..