Floating City: సముద్రంపై తేలుతూ తిరిగే భారీ తాబేలు నగరం
ఇప్పుడు మనం టూరిజం ప్లేస్‌కి వెళ్లాలంటే.. భూమి మీద ఉన్న ఏదో ఒక ప్రదేశాన్ని ఎంచుకుంటాం.. భవిష్యత్తులో అలా కాదు. సముద్ర నగరాలకు కూడా వెళ్లొచ్చు.
ఇప్పుడు మనం టూరిజం ప్లేస్‌కి వెళ్లాలంటే.. భూమి మీద ఉన్న ఏదో ఒక ప్రదేశాన్ని ఎంచుకుంటాం.. భవిష్యత్తులో అలా కాదు. సముద్ర నగరాలకు కూడా వెళ్లొచ్చు. ఇకపై రకరకాల నగరాలు నీటిపై తేలుతూ తిరుగుతూ ఉంటాయి. ఇప్పటికే ఇలాంటి కొన్ని ప్రాజెక్టులు తెరపైకి వచ్చాయి. తాజాగా మరొకటి తెగ ఆకట్టుకుంటోంది. ఈ నగరం ప్లాన్ తాబేలు ఆకారంలో నిర్మించబోతున్నారు. పాంజియాస్ సిటీ.. ప్రపంచంలో తొలి నీటిపై తేలే నగరంగా ఇది గుర్తింపు పొందుతుందని భావిస్తున్నారు. ఇటలీలో లగ్జరీ ప్రాజెక్టులను చేపట్టే.. లజ్జారినీ డిజైన్ స్టూడియో ఈ ప్రాజెక్టును 65 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించాలనుకుంటోంది. ఇప్పటికే సముద్రంపై తిరిగే చాలా ఆధునిక బోట్లను తయారుచేసే లజ్జారినీ సంస్థ.. 2033 నాటికల్లా తాబేలు సిటీ సిద్ధం చేయాలని ఫ్లాన్ చేస్తోంది. దీని నిర్మాణం మొదలై.. 8 ఏళ్లలో పూర్తి చేయాలని భావిస్తోంది. పాంజియాస్ సిటీపై 60 వేల మంది సముద్ర నీటిపై జీవించవచ్చని చెబుతున్నారు. ఈ తాబేలు నగరంలో హోటల్స్, షాపింగ్ మాల్స్, పార్కులు, డాక్, ఓ మినీ ఎయిర్‌పోర్ట్ రాబోతున్నాయి. సౌదీ అరేబియాలో సముద్రం పక్కన వందల హెక్టార్లలో ఈ ప్రాజెక్టు పనులు చేపట్టనున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కూతురుతో గడిపేందుకు లక్షల రూపాయల జాబ్ వదిలేసిన తండ్రి !!
Winter Health Care: జలుబు ఓపట్టాన వదలడంలేదా.. అయితే ఇలా చేయండి..
వ్యాయామం చేయాలంటే దుస్తులు అడ్డుకావు !! చీరకట్టుతో మహిళ వర్కవుట్స్ అదరగొట్టిందిగా !!
కోడిని స్వాహా చేద్దామని దూసుకొచ్చిన భారీ కొండచిలువ.. కానీ సీన్ రివర్స్‌అయి..
ఒరబ్బయ్య ఆహా.. అంటూ అదరగొట్టిన చిన్నారి.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో