కూతురుతో గడిపేందుకు లక్షల రూపాయల జాబ్ వదిలేసిన తండ్రి !!
ఖరగ్‌పూర్ ఐఐటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అంకిత్ జోషి.. ఓ మల్టీ నేషనల్ కంపెనీలో పెద్ద ఉద్యోగం సంపాదించాడు. ఆరంకెల జీతంతో హాయిగా ఉన్నాడు.
ఖరగ్‌పూర్ ఐఐటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అంకిత్ జోషి.. ఓ మల్టీ నేషనల్ కంపెనీలో పెద్ద ఉద్యోగం సంపాదించాడు. ఆరంకెల జీతంతో హాయిగా ఉన్నాడు. ఇంతలో అంకిత్‌కు తండ్రిగా ప్రమోషన్ వచ్చింది. ఇదే సమయంలో ఆయన భార్య ఆకాంక్ష పండంటి పాపకు జన్మనిచ్చింది. అంతే తన ముద్దుల కూతురుతో గడిపేందుకు తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. కొత్త ఉద్యోగ బాధ్యతల్లో తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుండటంతో తన ఆరంకెల జీతం ఉద్యోగానికి రాజీనామా సమర్పించారు. ఈయన విచిత్రమైన నిర్ణయానికి భార్య ఆకాంక్ష కూడా మద్దతు తెలిపింది. ‘తన కుమార్తె స్పితి జన్మించిన తర్వాత ఎక్కువ విరామం కావాలని కోరుకున్నా. అందుకు నా సెలవును పొడగించా. మళ్లీ పొడగించలేరని తెలుసు. అందుకే తండ్రిగా పొందిన ప్రమోషన్‌తో ఆనందించేందుకు ఉద్యోగానికి రాజీనామా చేశా..’ అని హ్యూమన్స్ ఆఫ్ బొంబేకు అంకిత్ జోషి వెల్లడించాడు.ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అంకిత్‌ను అభినందిస్తూ పెద్ద సంఖ్యలో కామెంట్స్ వస్తున్నాయి. కూతురు స్పితిని ముద్దాడుతున్న ఫొటోను హ్యూమన్స్ ఆఫ్ బొంబే ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌చేశారు. ఇది ప్రస్తుతం వైరల్‌గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Winter Health Care: జలుబు ఓపట్టాన వదలడంలేదా.. అయితే ఇలా చేయండి..
వ్యాయామం చేయాలంటే దుస్తులు అడ్డుకావు !! చీరకట్టుతో మహిళ వర్కవుట్స్ అదరగొట్టిందిగా !!
కోడిని స్వాహా చేద్దామని దూసుకొచ్చిన భారీ కొండచిలువ.. కానీ సీన్ రివర్స్‌అయి..
ఒరబ్బయ్య ఆహా.. అంటూ అదరగొట్టిన చిన్నారి.. నెట్టింట నవ్వులు పూయిస్తున్న వీడియో
Bruce Lee Death Mystery: 49 ఏళ్ల తరువాత వీడిన ‘బ్రూస్ లీ’ మరణ రహస్యం !! ఎలా చనిపోయాడంటే ??
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది
సీజన్ కాని సీజన్ లో మార్కెట్లోకి వచ్చిన పులస
మాంసం ముక్క గొంతులో ఇరుక్కొని ఊపిరి ఆగిపోయిన ఘటన
జమ్ముకశ్మీర్ లో తులిప్ గార్డెన్ కు పర్యాటకుల తాకిడి
12 నిమిషాల్లో.. కేజీ బంగారాన్ని కొట్టేశారు

