Workout Video: వ్యాయామం చేయాలంటే వయసు, దుస్తులు అడ్డుకావు.. చీరకట్టుతో 56 ఏళ్ల మహిళ వర్కవుట్స్‌ అదరగొట్టిందిగా..!

56 ఏళ్ల వయసులో చీరకట్టుతోనే వ్యాయామం చేస్తోంది ఈ మహిళ. వ్యాయామం చేయడానికి ఏదీ అడ్డుకాదని చాటిచెబుతోంది. ప్రస్తుతం ఈ వీడియో ఇన్ స్టా గ్రామ్ లో వైరల్ గా మారింది.

Workout Video: వ్యాయామం చేయాలంటే వయసు, దుస్తులు అడ్డుకావు.. చీరకట్టుతో 56 ఏళ్ల మహిళ వర్కవుట్స్‌ అదరగొట్టిందిగా..!
Woman In Gym With Saree
Follow us

|

Updated on: Nov 20, 2022 | 6:33 PM

ఉరుకుల పరుగుల జీవితంలో మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు.. దీంతో వయసుతో నిమిత్తం లేకుండా వ్యాధుల పడుతున్నవారు సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఆరోగ్యపరంగా వ్యాయామం శరీరానికి ఎంతో అవసరం. ఈ విషయం అందరికీ తెలిసిందే.. నిపుణులు కూడా తరచూ చెబుతూ ఉంటారు. వయసు పైబడుతున్నకొద్దీ ఎదురయ్యే అనారోగ్య సమస్యలను వ్యాయామంతో దూరంచేసుకోవచ్చని తమిళనాడులోని చెన్నై కు చెందిన ఓ మహిళ చెబుతోంది. చెప్పడమే కాదు, స్వయంగా వ్యాయామం చేసి చూపిస్తోంది. 56 ఏళ్ల వయసులో చీరకట్టుతోనే వ్యాయామం చేస్తోంది ఈ మహిళ. వ్యాయామం చేయడానికి ఏదీ అడ్డుకాదని చాటిచెబుతోంది. ప్రస్తుతం ఈ వీడియో ఇన్ స్టా గ్రామ్ లో వైరల్ గా మారింది. చెన్నైకి చెందిన 56 ఏళ్ల మహిళ మోకాళ్ల నొప్పులతో చాలా రోజులు ఆస్పత్రుల చుట్టూ తిరిగింది. అయినా ఉపయోగం లేకపోవడంతో కొడుకు సలహామేరకు జిమ్ లో చేరింది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో కొన్నాళ్లకే మార్పు కనబడిందని చెబుతోంది. ఇప్పుడు ఆరోగ్యంగా, చురుకుగా ఉన్నానని వివరించింది.

చీరతో వ్యాయామం చేస్తోన్న అత్తగారు

ఇవి కూడా చదవండి

చెన్నై లోనే సదరు మహిళ కొడుకుకు ఓ జిమ్ నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ కోడలుతో కలిసి జిమ్‌కు వెళ్తారు. చీరతోనే వెళ్ళి బరువులు ఎత్తుతూ ఆమె అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. తన 52వ ఏట వ్యాయామం మొదలుపెట్టానని, ఇప్పుడు తన వయసు 56 ఏళ్లు అని, వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా చురుకుగా ఉన్నానని వివరించారు. సదరు మహిళ జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేస్తూ.. ఆమె వయసు 56 ఏళ్లు.. జిమ్ కు చీరలో వస్తారు.. అయితేనేం, వ్యాయామం చేయకుండా ఆవిడను ఏదీ ఆపలేదని హ్యూమన్స్ ఆఫ్ మద్రాస్, మద్రాస్ బార్బెల్ కామెంట్ చేశాయి.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ స్మార్ట్ ఫోన్స్ చూస్తే కొనేయాల్సిందే.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్
ఈ స్మార్ట్ ఫోన్స్ చూస్తే కొనేయాల్సిందే.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్
టీమిండియా టీ20 ప్రపంచకప్ స్వ్కాడ్‌ నుంచి ఐదుగురు ఔట్..
టీమిండియా టీ20 ప్రపంచకప్ స్వ్కాడ్‌ నుంచి ఐదుగురు ఔట్..
మీరు కొత్త గ్యాస్‌ కనెక్షన్‌ తీసుకోవాలా? దరఖాస్తు చేయడం ఎలా?
మీరు కొత్త గ్యాస్‌ కనెక్షన్‌ తీసుకోవాలా? దరఖాస్తు చేయడం ఎలా?
ఘనంగా అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుక.. పాల్గొన్న బాలీవుడ్ తారలు
ఘనంగా అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుక.. పాల్గొన్న బాలీవుడ్ తారలు
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో ముగ్గురు.. లిస్టులో మనోడు..
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో ముగ్గురు.. లిస్టులో మనోడు..
పనిచేసే బ్యాంకుకే కన్నం వేసిన ఉద్యోగి.. ఎంత బంగారం దోచుకెళ్లాడంటే
పనిచేసే బ్యాంకుకే కన్నం వేసిన ఉద్యోగి.. ఎంత బంగారం దోచుకెళ్లాడంటే
వచ్చే ఎన్నికల్లో వైసీపీని భూస్థాపితం చేస్తాం.. చంద్రబాబు
వచ్చే ఎన్నికల్లో వైసీపీని భూస్థాపితం చేస్తాం.. చంద్రబాబు
రైలులో తనిఖీలు.. ఓ బ్యాగ్‌ తెరిచి చూడగా బిత్తరపోయిన పోలీసులు..
రైలులో తనిఖీలు.. ఓ బ్యాగ్‌ తెరిచి చూడగా బిత్తరపోయిన పోలీసులు..
ఉదయం కాఫీ తాగితే ఇంత ప్రమాదమా.? హెచ్చరిస్తున్న నిపుణులు
ఉదయం కాఫీ తాగితే ఇంత ప్రమాదమా.? హెచ్చరిస్తున్న నిపుణులు
ఘనంగా గామా అవార్డుల ప్రధానోత్సవం.. పాల్గొన్న సినీ ప్రముఖులు..
ఘనంగా గామా అవార్డుల ప్రధానోత్సవం.. పాల్గొన్న సినీ ప్రముఖులు..