AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Animals Videos: మనిషిపై గాడిద సవారీ.. ఇది పాకిస్తాన్ లో మాత్రం సాధ్యం అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్

ఒక గాడిద ఒక వ్యక్తి వెనుక వీపు మీద నిలబడి ఉంది. అతను గాడిదను మోస్తూ..  బస్సుపైకి ఎక్కుతున్నాడు. ఈ దృశ్యం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బస్సు పైకి ఎక్కడానికి నిచ్చెన ఉంది.

Animals Videos: మనిషిపై గాడిద సవారీ.. ఇది పాకిస్తాన్ లో మాత్రం సాధ్యం అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్
Donkey Video Viral
Follow us
Surya Kala

|

Updated on: Nov 21, 2022 | 10:04 AM

గాడిదలను సాధారణంగా వస్తువుల రవాణా కోసం ఉపయోగిస్తారు. ఈ కారణంగానే చాలా మంది గాడిదలను పెంచుకుంటారు.. వస్తువులను, ఇటుకలను, బట్టల వంటి వాటిని ఒక చోటు నుంచి మరోచోటకు గాడిదలు మంచి సహాయకారి. ఇప్పుడిప్పుడే గాడిద పాలకు డిమాండ్ పెరుగుతోంది. అంతేకాదు గాడిదల నిర్వహణ, ఆహారం ఖర్చు కూడా చాలా తక్కువ.  ఈ జీవిని  ప్రపంచంలోనే అత్యంత సహనంగల జీవి అని పిలుస్తారు. ఎందుకంటే గాడిద తన పై తనకు మించి భారం వేసినా కంగారుపడదు. సామానులతో పాటు యజమాని చెప్పిన మార్గంలో నడుస్తుంది. కొన్నిసార్లు మనుషులు గాడిదలపై ప్రయాణిస్తుంటారు. అయితే  కానీ మీరు ఎప్పుడైనా మనిషి వెనుక భాగంలో గాడిద ఎక్కి స్వారీ చేయడం చూశారా? అవును, ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో, ఒక గాడిద ఒక వ్యక్తి వెనుక వీపు మీద నిలబడి ఉంది. అతను గాడిదను మోస్తూ..  బస్సుపైకి ఎక్కుతున్నాడు. ఈ దృశ్యం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. బస్సు పైకి ఎక్కడానికి నిచ్చెన ఉంది. ఒక వ్యక్తి బస్సు పైకప్పుపైకి గాడిదను ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్నట్లు మీరు చూడవచ్చు. అయితే ఇలా గాడిద ఓ వ్యక్తి వీపు మీద నిలబడి ఉండగా.. మరొక వ్యక్తి వెనుక నుండి గాడిద కాళ్ళను పట్టుకున్నాడు. ఇలా చేయడం వలన గాడిద తన బ్యాలెన్స్ కోల్పోకుండా బస్సు టాప్ మీదకు చేరుకుంది. వైరల్ అవుతున్న వీడియో పాకిస్థాన్‌లోని బస్టాండ్ లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @HasnaZarooriHai అనే ఐడితో షేర్ చేయబడింది. మనుషులు గాడిదలపై సవారీ చేస్తూ తిరగడం చూసి ఉంటారు.. అయితే మనిషి వీపుపై గాడిద స్వారీ చేయడం చాలా అరుదుగా చూసే సన్నివేశం. పాకిస్థాన్‌లో అన్నీ సాధ్యమే అని కామెంట్ చేస్తున్నారు.

కేవలం 30 సెకన్ల ఈ వీడియో పలువురు నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇప్పటి వరకు 31 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది ఈ వీడియోను లైక్ చేసి రకరకాల కామెంట్లు కూడా చేశారు. ‘ఇది చారిత్రాత్మక ఘట్టం’ అని కొందరంటే, ‘గాడిద స్వారీ చేస్తోంది’ అని కొందరు సరదాగా అంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..