Police Bike Stunts: ఏంటి సామీ ఇదీ.. పోలీసువైయుండి..అవసరమా అది..! వైరల్ వీడియో..

Police Bike Stunts: ఏంటి సామీ ఇదీ.. పోలీసువైయుండి..అవసరమా అది..! వైరల్ వీడియో..

Anil kumar poka

|

Updated on: Nov 21, 2022 | 9:57 AM

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తుంటాయి. వారోత్సవాలు, మాసోత్సవాలు నిర్వహించి వారిలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు అధికారులు.


రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తుంటాయి. వారోత్సవాలు, మాసోత్సవాలు నిర్వహించి వారిలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు అధికారులు. ఇలా చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలను కొంతైనా తగ్గించవచ్చు. ఇందుకోసం పోలీసులతో పాటు రవాణా శాఖ అధికారులు కూడా నిమగ్నమై ఉండగా.. అవగాహన కల్పించాల్సిన బాధ్యత కలిగిన పోలీసులే కొన్నిచోట్ల నిబంధనలను అతిక్రమిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ లోని జలౌన్ జిల్లాలో పోలీస్ యూనిఫాం ధరించిన ఓ వ్యక్తి.. హై స్పీడ్ తో బైక్ నడుపుతూ.. చేతులు వదిలేసి ప్రమాదకరమైన స్టంట్స్ చేశాడు. అంతే కాకుండా ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. దీంతో ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి.నవంబర్ 30 వరకు ఉత్తర ప్రదేశ్ లో రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్‌పై ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ ప్రమాదాలను అరికట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. కానీ అదే సమయంలో ఓ పోలీస్ ఇలా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. యూనిఫాం ధరించిన వ్యక్తి గంటకు 80 కిలోమీటర్ల వేగంతో హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతూ కెమెరాకు కనిపించాడు. బైక్‌పై రెండు చేతులను వదిలి రోడ్డు మధ్యలో విన్యాసాలు చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసు శాఖకు చెందిన ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. యూనిఫాం ధరించిన వ్యక్తి గురించి తెలుసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఏది ఏమైనా.. ప్రమాదాల నివారణకు అవగాహన కల్పించాల్సిన వారే ఇలా నిబంధనలను అతిక్రమించడం దేనికి సంకేతమని వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ల్ రూపంలో ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Dog saved cat: పిల్లిపిల్లను కాపాడేందుకు కుక్క ప్లాన్‌ అదుర్స్‌..! కుక్కపై ప్రశంసలు.. వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో.

David Warner As Dj Tillu: డీజే టిల్లు గెటప్‌లో అదరగొట్టిన డేవిడ్‌ వార్నర్‌.. అదరహో అనిపించేలా వార్నర్‌ న్యూలుక్‌..

Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..