AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video: ఫ్రస్టేషన్ అంటే ఇలా ఉంటాది మరి.. వీడియో చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే..

సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత అనేక ఫన్నీ వీడియోలు దర్శనమిస్తున్నాయి. ఫేస్ బుక్, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఇలా ఏ మాద్యమం చూసుకున్న అనేక నవ్వులు పూయించే వీడియోలు కనిపిస్తాయి. ఈ వీడియోల్లో చాలా..

Funny Video: ఫ్రస్టేషన్ అంటే ఇలా ఉంటాది మరి.. వీడియో చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే..
Hair Cuting
Amarnadh Daneti
|

Updated on: Nov 21, 2022 | 11:38 AM

Share

సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత అనేక ఫన్నీ వీడియోలు దర్శనమిస్తున్నాయి. ఫేస్ బుక్, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఇలా ఏ మాద్యమం చూసుకున్న అనేక నవ్వులు పూయించే వీడియోలు కనిపిస్తాయి. ఈ వీడియోల్లో చాలా అంశాలు మన జీవితానికి సంబంధించిన అనుభవాలు, గుణపాఠాలే ఎక్కువుగా ఉంటాయి. మరికొంతమంది ఎంతో డిఫరెంట్‌గా ఆలోచించి వీడియోలు చేస్తూ ఉంటారు. ఎంత కూల్‌గా ఉండే వ్యక్తి అయినా ఏదో ఒక సమయంలో సహనం కోల్పోవడం సహజం. ప్రతి వ్యక్తి ఏదో ఒక టైంలో ఫ్రస్టేషన్‌కు గురవుతూ ఉంటాడు. అది ఇతర వ్యక్తుల ప్రభావం వల్లే జరుగుతూ ఉంటాయి. ప్రయాణ సమయాల్లో బస్సు, లేదా రైలు స్లోగా వెళ్తూ.. వెళ్లాల్సిన గమ్యానికి సమయంలో చేరుకోకపోతే ఫ్రస్టేషన్‌కు గురవుతారు చాలా మంది. చుట్టుపక్కల ఉన్న వారి వింత పోకడల వల్ల కొన్ని సార్లు ఫ్రస్టేషన్ ఫీల్ అయితే.. మంచి ఆకలితో ఉండి.. రెస్టారెంట్‌కు వెళ్లి ఫుడ్ ఆర్డర్‌ చేస్తే.. ఆ ఫుడ్ లేట్‌గా సర్వ చేసినా ఫ్రస్టేషన్‌కు గురవుతారు. కొన్ని సార్లు ఈ ప్రస్టేషన్‌ మన ప్రవర్తన వల్ల బయటపడిపోతుంది. కొంతమందికి అవతలి వ్యక్తి ఫ్రస్టేట్ అవుతున్నాడని తెలిసి కూడా తీరు మార్చుకోకపోతే.. ఎక్కడ లేని కోపం వస్తుంది. సేమ్ టు సేమ్ ఇలాంటి ఘటనకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో నవ్వులు పూయిస్తుంది.

ఒక వ్యక్తి హెయిర్ కట్ కోసం సెలూన్ షాప్‌కి వెళ్తాడు. హెయిర్ కట్ చేసే వ్యక్తి జుట్టును తడపడం కోసం వాటర్ కొడతాడు. ఇలా చేయడం ఎక్కడైనా సహజం. అయితే ఎక్కువ వాటర్ కొట్టడంతో కటింగ్ చేయించుకునే వ్యక్తికి షిరాకు వస్తుంది. దీంతో ఒక్క క్షణం ఆగమని.. దగ్గర్లో ఉన్న బకెట్లో వాటర్ తీసుకుని మగ్గుతో తలపై పోసుకుంటాడు. జుట్టు మొత్తం తడిసి ఉన్నా.. అయినా బార్బర్ మాత్రం హెయిర్ తడిపేందుకు వాటర్ కొడుతూనే ఉంటాడు.

ఇవి కూడా చదవండి

కోపంతో హెయిర్ కట్ చేయించుకునే వ్యక్తి మగ్గుతో బకెట్ లో నీళ్లు పోసుకుంటాడు. అయినా సరే బార్బర్ మళ్లీ నీళ్లు కొడతాడు. దీంతో ఫుల్ ఫ్రస్టేషన్‌కు గురై బార్బర్‌ను కొడతాడు. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు అయిన ఈ వీడియోను ఇప్పటివరకు లక్షల్లో వీక్షించారు. ఫ్రస్టేషన్‌కు పెద్ద ఉదాహరణ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by ???? (@funny_video_30066)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..