AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fifa World Cup: ఓ వైపు మెస్సీ, మరోవైపు దేశీ మహిళ మౌసీ.. ఎవరు గొప్ప చెప్పమంటున్న చిత్రం.. నెట్టింట్లో వైరల్..

కుండపై కుండ పెట్టుకుని అవలీలగా నడుస్తూ ఉంటారు. ఈ సమయంలో.. కుండలు కింద పడకుండా బ్యాలెన్స్ చేసే విధానము చూడాల్సిందే.  అదే విధంగా ఫుట్ బాల్ గేమ్‌లో కూడా బ్యాలెన్స్ కూడా అంతే ముఖ్యం. కనుక ఫుట్ బాల్ ను బ్యాలెన్స్‌ను సాధించడం ఎంత కష్టమో మీరు ఏ ఫుట్‌బాల్ క్రీడాకారుడిని అయినా అడగవచ్చు.

Fifa World Cup: ఓ వైపు మెస్సీ, మరోవైపు దేశీ మహిళ మౌసీ.. ఎవరు గొప్ప చెప్పమంటున్న చిత్రం.. నెట్టింట్లో వైరల్..
Fifa World Cup 2022 Viral Photo
Surya Kala
|

Updated on: Nov 26, 2022 | 9:39 AM

Share

ప్రస్తుతం ప్రపంచాన్ని ఫుట్ బాల్ పోటీల ఫీవర్ పట్టుకుంది. ఖతార్‌లో FIFA వరల్డ్ కప్ 2022 నిర్వహిస్తున్నప్పటికీ.. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పడింది.  క్రీడాభిమానులు, సాధారణ ప్రజానీకం, ​​రాజకీయ నాయకులు, నటులు సహా ప్రతి ఒక్కరూ FIFA ఫుట్‌బాల్ ప్రేమికులుగా మారారు. అందుకు సంబంధిత హ్యాండిల్స్‌లో ఒకటి కంటే ఎక్కువ చిత్రాలు, వీడియోలు షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒక ఫోటోని శశి థరూర్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు.

నేటికీ భారతదేశంలోని చాలా గ్రామీణ ప్రాంతాల్లోని స్త్రీలు నీళ్లతో నిండిన కుండను తమ తలపై పెట్టుకుని మోస్తూ ఉంటారు. కుండపై కుండ పెట్టుకుని అవలీలగా నడుస్తూ ఉంటారు. ఈ సమయంలో.. కుండలు కింద పడకుండా బ్యాలెన్స్ చేసే విధానము చూడాల్సిందే.  అదే విధంగా ఫుట్ బాల్ గేమ్‌లో కూడా బ్యాలెన్స్ కూడా అంతే ముఖ్యం. కనుక ఫుట్ బాల్ ను బ్యాలెన్స్‌ను సాధించడం ఎంత కష్టమో మీరు ఏ ఫుట్‌బాల్ క్రీడాకారుడిని అయినా అడగవచ్చు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ చిత్రంపై ఓ లుక్ వేయండి.. ఒక మహిళ తన తలపై ఐదు కుండలను బ్యాలెన్స్ చేస్తోంది.. మరొకవైపు ప్రముఖ ఫుట్ బాల్ క్రీడాకారుడు మెస్సీ తన తలపై ఫుట్‌బాల్‌ను బ్యాలెన్స్ చేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న చిత్రంలో, ఒక వైపు ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సీ ఉండగా, మరోవైపు ఒక మహిళ కనిపించడం మీరు చూడవచ్చు. మెస్సీ తన తలపై  ఫుట్‌బాల్‌ని మాత్రమే బ్యాలెన్స్ చేస్తున్నాడు.. అయితే ఆ మహిళ మాత్రం తన తలపై ఏకంగా ఐదు కుండలను బ్యాలెన్స్ చేస్తూ కనిపిస్తుంది.

ఎనిమిది వేల మందికి పైగా ఈ చిత్రాన్ని లైక్ చేసారు. ‘నిజంగా దేశీ ఆంటీ బ్యాలెన్స్ ప్రపంచ స్థాయి మెస్సీ కంటే మెరుగ్గా ఉంది’ అని వ్రాశారు. మరొకరు  ‘ఈ మహిళకు అవకాశం దొరికితే గొప్ప ఫుట్‌బాల్ క్రీడాకారిణి అయ్యేది.’ అని వ్యాఖ్యానించారు. ‘ప్రపంచంలో అన్ని ముందుకు వెళ్తున్నాయి.. ఇది మాత్రం 2005లో మాత్రమే నిలిచిపోయింది. ‘ అని రాశారు. నిజానికి వైరల్ అవుతున్న ఈ చిత్రం అప్పటిది. ఈ ఫోటోని మళ్ళీ షేర్ చేస్తూ.. సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..