Hair Cutter Frustration: ఫ్రస్టేషన్ అంటే ఇట్లుంటది.. వీడియో చూస్తే పొట్ట చెక్కలే..
ప్రతి వ్యక్తి ఏదో ఒక టైంలో ఫ్రస్టేషన్‌కు గురవుతూ ఉంటాడు. అది ఇతర వ్యక్తుల ప్రభావం వల్లే జరుగుతూ ఉంటాయి. కొంతమందికి అవతలి వ్యక్తి ఫ్రస్టేట్ అవుతున్నాడని తెలిసి కూడా తీరు మార్చుకోకపోతే.. ఎక్కడ లేని కోపం వస్తుంది.
ఒక వ్యక్తి హెయిర్ కట్ కోసం సెలూన్ షాప్‌కి వెళ్లాడు. హెయిర్ కట్ చేసే వ్యక్తి జుట్టును తడపడం కోసం వాటర్ కొట్టాడు. ఇలా చేయడం ఎక్కడైనా సహజం. అయితే ఎక్కువ వాటర్ కొట్టడంతో కటింగ్ చేయించుకునే వ్యక్తికి చిరాకు వచ్చింది. దీంతో ఒక్క క్షణం ఆగమని.. దగ్గర్లో ఉన్న బకెట్లో వాటర్ తీసుకుని మగ్గుతో తలపై పోసుకుంటాడు. జుట్టు మొత్తం తడిసి ఉన్నా.. అయినా బార్బర్ మాత్రం హెయిర్ తడిపేందుకు వాటర్ కొడుతూనే ఉంటాడు. కోపంతో హెయిర్ కట్ చేయించుకునే వ్యక్తి మగ్గుతో బకెట్ లో నీళ్లు పోసుకుంటాడు. అయినా సరే బార్బర్ మళ్లీ నీళ్లు కొడతాడు. దీంతో ఆ వ్యక్తి ఫుల్ ఫ్రస్టేషన్‌కు గురై బార్బర్‌ను కొడతాడు. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు అయిన ఈ వీడియోను లక్షల్లో వీక్షించారు. ఫ్రస్టేషన్‌కు పెద్ద ఉదాహరణ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..