Cow Urine water tank clean: అమానుషం..వాటర్ ట్యాంక్ వద్ద నీళ్లు తాగిన దళిత మహిళ.. గోమూత్రంతో వాటర్ ట్యాంక్ క్లీన్..!
కుల, మతాల పేరుత జనం మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా కర్ణాటకలో విస్తుపోయే ఘటన ఒకటి అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ దళిత మహిళ నీరు తాగిందనే అక్కసుతో.. గోమూత్రంతో నీటి ట్యాంకర్‌ను శుభ్రం చేశారు గ్రామస్తులు.
కుల, మతాల పేరుత జనం మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా కర్ణాటకలో విస్తుపోయే ఘటన ఒకటి అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ దళిత మహిళ నీరు తాగిందనే అక్కసుతో.. గోమూత్రంతో నీటి ట్యాంకర్‌ను శుభ్రం చేశారు గ్రామస్తులు. ఛామరాజనగర్ జిల్లా హోగ్గోటరా గ్రామంలో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. నవంబర్ 18వ తేదీన గ్రామంలో ఓ వివాహ వేడుక జరిగింది. అయితే.. ఆ వేడుకకు హాజరైన ఓ మహిళ.. తిన్న తర్వాత దాహం తీర్చుకునేందుకు అక్కడే ఉన్న ఓ వాటర్ ట్యాంకర్ నల్లా ద్వారా నీరు తాగింది. ఇది గమనించిన కొందరు పెద్దలు.. సదరు మహిళ ఎస్సీ వర్గం కావడంతో రచ్చ చేశారు. వేడుకలో తాగేందుకు ఎవరూ అంగీకరించలేదని.. అందుకే దాహం తీర్చుకునేందుకు ట్యాంక్ నీళ్లు తాగానని ఆమె చెప్పింది. అయితే ఆ పెద్దలు ఆమెను మందలించి.. ట్యాంకర్ నుంచి నీటిని ఖాళీ చేయించారు. ఆపై పవిత్రమైన గోమూత్రంతో ట్యాంకర్‌ను శుభ్రం చేయించారట. కాగా, ఈ ఘటన స్థానిక తహసీల్దార్ దృష్టికి వెళ్లగా.. ట్యాంకర్ శుభ్రం చేసిన మాట వాస్తవమేనని, అయితే అది గోమూత్రంతో అవునా? కాదా? అనే విషయంపై స్పష్టత లేదని తెలిపారు. మొత్తం వ్యవహారంపై విచారించి, కేసు నమోదు చేస్తామన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

