Viral Video: వామ్మో! రెప్పపాటులో కొండపై నుంచి బైక్‌తో గాల్లోకి ఎగిరి.. ఆపై నేరుగా.. వణుకు పుట్టించే వీడియో!
సాధారణంగా స్టంట్స్ చేసేవారు రెండు రకాలు ఉంటారు. ఒకరు ఓవర్‌నైట్‌లో ఫేమ్ సంపాదించేందుకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా..

సోషల్ మీడియాలో ఎన్నో రకాల వైరల్ వీడియోలు తరచూ హల్చల్ చేస్తుంటాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాయి. అలాగే ఇంకొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మిగతావి షాక్‌కు గురి చేస్తాయి. ఇక ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
సాధారణంగా స్టంట్స్ చేసేవారు రెండు రకాలు ఉంటారు. ఒకరు ఓవర్‌నైట్‌లో ఫేమ్ సంపాదించేందుకు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా స్టంట్స్ చేస్తే.. మరొకరు ప్రొఫెషనల్స్.. చాకచక్యంగా చాలా ఈజ్‌తో రెప్పపాటులో పూర్తి చేస్తారు. ఇక అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో.. ఓ వ్యక్తి రెప్పపాటులో తన బైక్‌తో ట్రాక్ మీదుగా క్షణాల్లో కొండపై నుంచి గాల్లోకి ఎగురుతాడు. ఆపై ప్యారాచూట్ సాయంతో కిందకు వస్తాడు. అది అత్యంత ప్రమాదకరమైన స్టంట్ అని చెప్పొచ్చు. ఎక్కడైనా పొరపాటు జరిగితే.. ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇలాంటి స్టంట్స్ కేవలం నిపుణులు మాత్రమే చేస్తారు. మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా షాక్ అవుతారు.
View this post on Instagram
కాగా, ఈ వీడియోను ‘శ్రవణ్_9_9’ అనే నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇప్పటివరకు దీనికి 14 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అలాగే 8.50 లక్షల మందికి పైగా లైక్ కొట్టారు. ‘సోదరా.. నీ డేర్‌నెస్‌కు హ్యాట్సాఫ్.. ఈ స్టంట్ చూసి మాకు హార్ట్ ఎటాక్ వచ్చినంత పనైంది’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘అసలు ఆ వ్యక్తి బ్రతికాడా.! లేదా.!’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి వీడియోపై లుక్కేయండి.
Also Read:
Viral News: డిన్నర్ డేట్‌కు వెళ్లారు.. లైట్‌గా ఫుడ్ లాగించారు.. చివరికి బిల్లు చూసి కళ్లు తేలేసారు!