Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: అతిలోక సుందరిని దించేసింది..63 ఏళ్ల బామ్మ డ్యాన్స్‌ వీడియో వైరల్‌..

'వయసు ఒక అంకె మాత్రమే' అన్న మాటలను నిజం చేస్తూ ఇటీవల ఎంతో మంది వృద్ధులు తమ సృజనాత్మకతను..

Viral video: అతిలోక సుందరిని దించేసింది..63 ఏళ్ల బామ్మ డ్యాన్స్‌ వీడియో వైరల్‌..
Follow us
Basha Shek

|

Updated on: Oct 30, 2021 | 9:39 AM

‘వయసు ఒక అంకె మాత్రమే’ అన్న మాటలను నిజం చేస్తూ ఇటీవల ఎంతో మంది వృద్ధులు తమ సృజనాత్మకతను చాటుకుంటున్నారు. వివిధ రంగాల్లో తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ కోవకే చెందుతారు దిల్లీకి చెందిన ‘డ్యాన్సింగ్‌ దీదీ’ రవి బాలశర్మ. ఆరుపదుల వయసులో డ్యాన్స్‌పై ఆసక్తి పెంచుకున్న ఈ బామ్మ…పలువురు బాలీవుడ్‌ అందాల తారలను అనుకరిస్తూ ఎంతో హుషారుగా స్టెప్పులేస్తున్నారు. గతంలో మాధురీ దీక్షిత్‌, ఐశ్వర్యారాయ్‌ సినిమా పాటలకు కాలు కదిపిన ఆమె తాజాగా అతిలోక సుందరి పాటకు అద్భుతంగా కాలు కదిపారు.

2012లో విడుదలైన శ్రీదేవి సినిమా ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్‌’ లోని ‘నవ్రాయ్‌ మాఝీ’ సాంగ్‌ సినీ ప్రియులను బాగా ఆకట్టుకుంది. ఆ పాటలో అతిలోక సుందరి వేసిన స్టెప్పులు అభిమానులను బాగా అలరించాయి. తాజాగా ఇదే పాటకు అద్భుతంగా కాలు కదిపారు రవి బాల శర్మ. అచ్చం శ్రీదేవిలానే చీరకట్టులో ముస్తాబై ఎంతో ఉత్సాహంగా స్టెప్పులేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘ మేడమ్‌.. మీ డ్యాన్స్‌ సూపర్బ్‌.. శ్రీదేవిని దించేశారు’ అంటూ నెటిజన్లు రవి బాల శర్మపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Also Read:

Viral Video: బ్రేక్‌కు బదులుగా యాక్సలేటర్ రేజ్ చేశాడు.. ఆ తరువాత జరిగింది చూస్తే నవ్వు ఆపుకోలేరంతే..

చనిపోయిన యువతీయువకులకు ఘనంగా వివాహం.. ఈ వింత ఆచారం ఎక్కడంటే..

Viral Video: కాకి, కుండ కథను ఈ పక్షి ఎంత బాగా ఫాలో అయ్యిందో చూడండి.. దీని తెలివికి ఫిదా కాని వారంటూ ఉండరు..