Viral Video: బ్రేక్‌కు బదులుగా యాక్సలేటర్ రేజ్ చేశాడు.. ఆ తరువాత జరిగింది చూస్తే నవ్వు ఆపుకోలేరంతే..

Viral Video: ప్రమాదవశాత్తూ ఓ యువకుడు బైక్ బ్రేక్‌కు బదులుగా యాక్సిలేటర్‌ను రేస్ చేయడంతో ఆ బైక్ ఫోటో స్టూడియోలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన భివాండిలోని వంజరపట్టి నాకా..

Viral Video: బ్రేక్‌కు బదులుగా యాక్సలేటర్ రేజ్ చేశాడు.. ఆ తరువాత జరిగింది చూస్తే నవ్వు ఆపుకోలేరంతే..
Bike
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 30, 2021 | 8:52 AM

Viral Video: ప్రమాదవశాత్తూ ఓ యువకుడు బైక్ బ్రేక్‌కు బదులుగా యాక్సిలేటర్‌ను రేస్ చేయడంతో ఆ బైక్ ఫోటో స్టూడియోలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన భివాండిలోని వంజరపట్టి నాకా ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో షాప్‌లో ఉన్న సీసీటీవీలో రికార్డవడగా.. ఇప్పుడు అది వైరల్‌గా మారింది. కాగా, ఈ ప్రమాదంలో ఫోటో స్టూడియోకి చెందిన ఓ ఫోటోగ్రాఫర్ అదృష్టవశాత్తూ బయటపడ్డాడు.

వివరాల్లోకెళితే.. వంజరపట్టి ప్రాంతంలోని పటేల్‌నగర్‌లో హర్షిత్ డిజిటల్ ఫోటో స్టూడియో ఉంది. పని నిమిత్తం ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై స్టూడియో వద్దకు వచ్చాడు. తన బైక్‌ను ఫోటో స్టూడియో ముందు రోడ్డుపై పార్క్ చేశాడు. పని పూర్తయిన తరువాత బైక్‌పై తిరిగి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో బైక్‌ను స్టార్ట్ చేసి గేర్ వేశాడు. అయితే, ఒక్కసారిగా యాక్సిలేటర్ పెంచడంతో బైక్ అదుపు తప్పి ఫోటో స్టూడియోలోకి దూసుకు వెళ్లింది. ఈ ఘటనలో స్టూడియోలోని పలు వస్తువులు, పరికరాలు ధ్వంసమయ్యాయి. జరిగిన ప్రమాదానికి బైకర్.. సదరు ఫోటో స్టూడియో యాజమాన్యానికి క్షమాపణలు చెప్పాడు. స్టూడియోకి జరిగిన నష్టానికి పరిహారం కూడా చెల్లిస్తానని అనడంతో యజమాని కాంప్రమైజ్ అయ్యాడు. కాగా, ఈ ఘటన మొత్తం ఫోటో స్టూడియోలోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసి నెటిజన్లు పాపం అంటూ తెగ నవ్వుకుంటున్నారు.

Also read:

Twitter: హిందూ దేవతలపై అభ్యంతరకర కంటెంట్‌ తొలగించాల్సిందే.. ట్విట్టర్‌కు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు!

Crime News: భర్తకు వీడియో కాల్ చేసి భార్య అఘాయిత్యం.. ఇంటికి తీసుకెళ్లడం లేదని ఏం చేసిందంటే..?

Badvel Bypoll: భారీ బందోబస్తు మధ్య కొనసాగుతున్న పోలింగ్.. క్యూ కట్టిన ఓటర్లు.. లైవ్ వీడియో

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..