Corona Drugs: కరోనా రక్కసి పీచమణిచే డ్రగ్ వచ్చేసింది!.. త్వరలోనే అందుబాటులోకి తెస్తామన్న ప్రముఖ ఫార్మా కంపెనీ..
Corona Drugs: కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. కోట్లాది మంది ప్రాణాలు కోల్పోగా.. లక్షలాది మంది నిరాశ్రయులు అయ్యారు.
Corona Drugs: కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. కోట్లాది మంది ప్రాణాలు కోల్పోగా.. లక్షలాది మంది నిరాశ్రయులు అయ్యారు. కరోనా దెబ్బకు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు జనాలు. అంతలా భయపెట్టింది కరోనా రక్కసి. కాగా, రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని అంతం చేసే ఫస్ట్ డ్రగ్ వచ్చేసింది. ఇకపై ఈ మహమ్మారిని ఎదురుకోవడానికి ట్యాబ్లెట్స్ వచ్చేసాయ్. కోవిడ్-19ను ఎదుర్కునేందుకు ఎన్నో వ్యాక్సిన్స్ వచ్చినప్పటికీ.. ప్రముఖ అంతర్జాతీయ ఫార్మా కంపెనీ మెర్క్.. రిడ్జ్ బ్యాక్ బయోథెరపీటిక్స్ సహకారంతో ‘మోల్నుపిరావిర్’ అనే ట్యాబ్లెట్‌ను తయారు చేసింది. తొలి దశలో జంతువులపై చేసిన క్లినికల్ ట్రయిల్స్ కూడా సక్సెస్ అయ్యింది. ఈ డ్రగ్ వినియోగం.. మరణాల సంఖ్యతో పాటు కొత్తగా వచ్చే ఏవై4.2 లాంటి కొత్త వేరియంట్స్ బారిన పడే వారి సంఖ్యను కూడా 50% మేరకు తగ్గించవచ్చని మెర్క్ సంస్థ పేర్కొంది.
కాగా, త్వరలోనే ఈ ఔషధాన్ని మాత్రల రూపంలో అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పేద దేశాల్లో అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేయనున్నట్లు మెర్క్ ఫార్మా ప్రకటించింది. రెడ్డీస్ ల్యాబ్ లాంటి 8 కంపెనీలు ఈ మాత్రలు తయారు చేయడానికి ముందుకొచ్చాయని మెర్క్ తెలిపింది. యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మిస్ట్రేషన్ పర్మిషన్ ఇవ్వగానే అన్ని దేశాలకు అందేలా చూస్తామన్నారు మెర్క్ సంస్థ ప్రతినిథులు. ఈ డ్రగ్ కి అనుమతి ఇస్తే కరోనాకి సంజీవనిలా పనిచేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ డ్రగ్ కరోనాపై ఎంతవరకు ప్రభావం చూపుతుందనే తెలియాలంటే.. అది మార్కెట్‌లోకి వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.
Also read:
Puneeth Rajkumar: అప్పు మరణ వార్త విని ఓ అభిమాని మృతి..బెంగళూరులో రేపటి వరకూ మద్యం అమ్మకాలపై నిషేధం