చనిపోయిన యువతీయువకులకు ఘనంగా వివాహం.. ఈ వింత ఆచారం ఎక్కడంటే..

పెళ్లీళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. ఎక్కడెక్కడో ఉన్నవారిని.. పెళ్లీతో ఒక్కటి చేస్తారు.. కేవలం ఇద్దరు మనుషులు

చనిపోయిన యువతీయువకులకు ఘనంగా వివాహం.. ఈ వింత ఆచారం ఎక్కడంటే..
Kerala
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 30, 2021 | 8:10 AM

పెళ్లీళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు. ఎక్కడెక్కడో ఉన్నవారిని.. పెళ్లీతో ఒక్కటి చేస్తారు.. కేవలం ఇద్దరు మనుషులు మాత్రమే కాదు.. రెండు కుటుంబాల మధ్య బంధుత్వం ఏర్పడుతుంది. పెళ్లంటే.. ప్రతి ఒక్కరి జీవితంలో మర్చిపోలేని అనుభవం.. వివాహం నిర్ణయించిన రోజు నుంచి పెళ్లి తంతు ముగిసే వరకు ఆ ఇంట్లో పెద్ద సందడి. ఆహ్వాన పత్రికలు పంచడం నుంచి వివాహం ఘట్టాలు ముగిసే వరకు.. ఆనందాలు.. అల్లరితో హడావిడిగా ఉంటుంది. కానీ.. పెళ్లీడుకు వచ్చిన యువతీయువకులు అనుకోకుండా మరణిస్తే ఆ కుటుంబంలో భాద వర్ణనాతీతం.. కానీ చనిపోయిన యువతీయువకులు పెళ్లీళ్లు చేస్తున్నారు. అయితే ఇద్దరు ప్రేమికులకు చనిపోయిన తర్వాత పెళ్లి చేస్తున్నారనుకుంటే పొరపాటే.. కాదు.. తమ కుటుంబాల్లో ఆకస్మాత్తుగా గానీ.. అనారోగ్య సమస్యలతో చనిపోయిన వారికి పెళ్లి చేస్తున్నారు.. పెళ్లి చూపులు మొదలుకొని ఆహ్వాన పత్రికలు పంచడం వరకు సాధరణ పెళ్లికి ఏ మాత్రం తీసిపోని రీతిలో ఘనంగా వివాహం చేస్తున్నారు. చనిపోయిన వారికి ఎందుకు పెళ్లి చేస్తున్నారు ? ఎలా పెళ్లి చేస్తున్నారు ? అనేది తెలుసుకుందామా.

కేరళలోని ఓ తెగ ప్రజలు వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. కాసర గడ్ జిల్లా మారుమూల ప్రాంతమైన బడియడుక్కా గ్రామానికి చెందిన మగోర్ తెగ ప్రజలు చాలా కాలంగా చనిపోయినవారికి వివాహాలు జరిపిస్తున్నారు. పెళ్లి కాకుముందే మృతి చెందిన తనువారికి బొమ్మలు రూపంలో ఈ వివాహం జరిపిస్తారు. దీంతో చనిపోయిన వారి ఆత్మలు స్వర్గంలో సుఖంగా ఉంటారనేది ఆ తెగ వారి నమ్మకం.. ముందుగా పెళ్లి కాకుండా చనిపోయిన తమ యువకుడి పెళ్లి కోసం వారి బంధువులు.. పెళ్లి కాకుండా చనిపోయిన యువతి ఇంటికి పెళ్లిచూపులకు వెళ్తారు. అక్కడ అన్నీ మాట్లాడుకుని వివాహానికి ముహుర్తం నిర్ణయిస్తారు. ఆ తర్వాత ఆహ్వాన పత్రికల్ని ముద్రించి బంధువులకు అందజేస్తారు. పెళ్లి రోజునాడు మండపాన్ని అందంగా ముస్తాబు చేసి.. బొమ్మల రూపంలో ఆ యువజంటను తయారు చేసి.. వారికి పెళ్లి చేస్తారు.. ఈ కార్యక్రమాన్ని రాత్రి సమయంలో మాత్రమే జరిపిస్తారు. వివాహానికి వచ్చిన అతిథులకు మంచి విందు కూడా ఏర్పాటు చేసి కొత్తజంటను దీవించమని కోరతారు. పెళ్లి తర్వాత మళ్లీ వారు విడిపోకుండా.. ఆ తర్వాత కూడా వారి బంధుత్వాన్ని కొనసాగిస్తారు. తరుచూ ఒకరి ఇంటికి మరొకరు వెళుతుంటారు. వివాహం చేయకుండా చనిపోయిన వారికి పెళ్లి చేయకుండా ఉంటే చెడు జరుగుతుందని మగోర్ తెగ ప్రజలు అంటారు. చిన్న వయుసులో చనిపోయినవారికి ఇలా వివాహం జరిపిస్తున్నట్టు చెప్పారు.

Also Read: Puneeth Rajkumar: పునీత్‌ రామ్‌కుమార్‌ అకాల మరణం.. ప్రశ్నార్థకంగా మారిన రూ. 400 కోట్ల పెట్టుబడులు..

ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే