డ్రోన్ ను పక్షిగా భావించిన మొసలి.. వేటాడేందుకు నీటిలో నుంచి జంప్ చేసి.. కానీ..
మొసళ్లు చాలా ప్రమాదకరమైన జంతువులు. నీటిలో హాయిగా రెస్ట్ తీసుకునే ఇవి.. ఆహారం కోసం చాలా చురుకుగా వేటాడుతుంటాయి. ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన జంతువుల్లో ఇవి ఒకటి అని చెప్పవచ్చు. ఇవి చాలా..
మొసళ్లు చాలా ప్రమాదకరమైన జంతువులు. నీటిలో హాయిగా రెస్ట్ తీసుకునే ఇవి.. ఆహారం కోసం చాలా చురుకుగా వేటాడుతుంటాయి. ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన జంతువుల్లో ఇవి ఒకటి అని చెప్పవచ్చు. ఇవి చాలా బలవంతమైనవి. వివిధ రకాల జంతువులనే కాకుండా మనుషులనూ వేటాడుతుంటుంది. ఇక వీటి చేతికి చిక్కామంటే బతుకు పై ఆశలు వదులుకోవాల్సిందే. అడవిలోని జంతువులూ వీటి వద్దకు వెళ్లేందుకు భయపడుతుంటాయి. ఇవి నివసించే మడుగులో నీటిని తాగేందుకూ వెనకడుగు వేస్తాయి. ప్రాణాలకు తెగించి మందుకు వెళ్తే ప్రాణాలు పోతాయని కలవరపడుతుంటాయి. మొసలి వేటాడే వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. వాస్తవానికి ఈ వీడియోలో ఒక మొసలి గాలిలో ఎగిరే డ్రోన్‌ను ఆహారంగా భావిస్తుంది. దానిని అందుకోవడానికి నీటిలో నుంచి బయటకు జంప్ చేస్తుంది. అయితే అది ఆహారం కాదని తెలుసుకున్న మొసలి హర్ట్ అయ్యి, గప్ చుప్ గా నీళ్లలోకి వెళ్లిపోయింది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో నీటి పై డ్రోన్ తిరుగుతుంటుంది. అదే సమయంలో నీళ్లల్లో దాగి ఉన్న మొసలి.. డ్రోన్ ను పక్షి అని భావిస్తుంది. ఎలాగైనా వేటాడాలని, తిని కడుపు నింపుకోవాలని భావించింది. అంతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నీటిలో నుంచి బయటకు జంప్ చేసింది. ఆహారాన్ని అందుకోవాలని ట్రై చేసింది. కానీ అది పక్షి కాదని అర్థమై.. మళ్లీ నీళ్లలోకి వెళ్లిపోతుంది. అయితే ఆ డ్రోన్ మొసలికి అందలేదు. ఒకవేళ నోటికి చిక్కి ఉంటేట మాత్రం పరిస్థితి మరో విధంగా ఉండేదని మనకు అర్థమవుతోంది.
The use of drones for wild photografer should be stopped from interfering in the field of wildlife ?@susantananda3 pic.twitter.com/mZ9zC48W6x
— Santosh Sagar (@santoshsaagr) October 1, 2022
ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. 12 సెకన్ల వీడియోను ఇప్పటివరకు 22 వేలకు పైగా వ్యూస్, వందల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి. అంతే కాకుండా వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘టెక్నాలజీ నేచర్ తో ఇలాంటి జోక్యాన్ని ఎవరూ ఊహించలేరని’ తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..