Cat Video: చిప్స్ ప్యాకెట్‌లోకి పిల్లి ఎలా వచ్చిందబ్బా.! నెటిజన్లను కన్‌ఫ్యూజ్ చేస్తోన్న వీడియో..
ఊహకు కూడా అందని ఎన్నో విషయాలకు సోషల్ మీడియాలో కేంద్రంగా మారింది. ఫొటోలు, వీడియోలు ఫన్‌తో పాటు ఆశ్చర్యానికి కూడా కలిగిస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సంఘటన..
ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు రోజులో సోషల్ మీడియా యాప్‌ను ఓపెన్ చేయకుండా ఉండని పరిస్థితి. స్కూల్‌కు వెళుతోన్న విద్యార్థుల నుంచి రిటైర్ అయిన ఉద్యోగుల వరకు ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియాను వాడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న కంటెంట్ అలాంటిది మరి. ప్రతి రోజూ ఎన్నో రకాల ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోనే ఉన్నాయి. వీటిలో కొన్ని సమాచారం అందించేవి అయితే మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగించేవి.
ఊహకు కూడా అందని ఎన్నో విషయాలకు సోషల్ మీడియాలో కేంద్రంగా మారింది. ఫొటోలు, వీడియోలు ఫన్‌తో పాటు ఆశ్చర్యానికి కూడా కలిగిస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియకపోయినప్పటికీ ప్రస్తుతం వీడియో మాత్రం ట్రెండ్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఓ కుర్రాడు చిప్స్‌ను తిందామని చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేశాడు. అయితే ఓపెన్ చేయగానే అందులో నుంచి ఓ పిల్లి తల బయటకు పెడుతూ వచ్చింది. దీనిని వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త ప్రస్తుతం తెగ చక్కర్లు కొడుతోంది.
— cat in odd places (@catinoddplaces) September 30, 2022
నిజంగా నిజమేనా.?
ఇదిలా ఉంటే నెట్టింట వైరల్ అవుతోన్న ఈ వీడియో కావాలనే చిత్రీకరించినట్లు అర్థమవుతోంది. ఇటీవల కొందరు కావాలనే వైరల్ వీడియోలను సృష్టిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతోన్న వీడియో కూడా ఈ జాబితాలోకి వస్తుందన్నట్లు కనిపిస్తోంది. అసలు చిప్స్ ప్యాకెట్‌లోకి పిల్లి వచ్చే అవకాశం ఎలా ఉంటుంది అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక చిప్స్ ప్యాకెట్ కింది వైపు ఓపెన్ చేసి అందులో పిల్లిని ఉంచినట్లు అనుమానం వస్తోంది. ఏది ఏమైనా ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ సందడి చేస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..