Memory Test: నెటిజన్లకు ఆనంద్ మహీంద్రా మైండ్ టెస్ట్.. మీలో ఎంత మంది పాస్ అవుతారో చెక్ చేసుకోండి..
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దేశంలోని వ్యాపారవేత్తల్లో మనకు ప్రముఖంగా వినిపించే పేరు ఆనంద్ మహీంద్రా, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ అయిన ఆయన.. తరచూ సోషల్ మీడియాలో వివిధ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకోవడంతో పాటు.. కొన్ని ఆసక్తికరమైన..
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దేశంలోని వ్యాపారవేత్తల్లో మనకు ప్రముఖంగా వినిపించే పేరు ఆనంద్ మహీంద్రా, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ అయిన ఆయన.. తరచూ సోషల్ మీడియాలో వివిధ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకోవడంతో పాటు.. కొన్ని ఆసక్తికరమైన ఘటనలకు సంబంధించిన ఫోటోలు లేదా వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేయడం చూస్తుంటాం. ఆయన పోస్టు చేసిన అనేక పోస్టు సామాజిక మాద్యమాల్లో ఎంతో ట్రెండింగ్ కూడా అవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆయన చేసిన పోస్టుల్లో ఎంతో అర్థం దాగిఉంటుంది. కొన్ని నాలెడ్జ్ కు సంబంధించిన పోస్టులను ఆయన షేర్ చేస్తూ ఉంటారు. అయితే రీసెంట్ గా నెటిజన్లుకు ఆయన ఒక పరీక్ష పెట్టారు. చూడటానికి చాలా సులభంగా ఉన్నా.. ఆయన చెప్పినట్లు చేస్తే మాత్రం పాస్ అవడం కొచెం కష్టంగానే ఉంది. అయినా మీరూ ఓ సారి ట్రై చేసి.. మీ మెమరీని టెస్ట్ చేసుకోండి. సాధారణంగా 50 ఏళ్లకు పైబడిన వారు ఈ టెస్టులో పాస్ కావడం కష్టం అని ఆయన ట్వీట్ లో చెప్పినా.. యువకులు కూడా ఆ పరీక్ష పాస్ అవడం కొంచెం కష్టంగానే ఉంది. అయినా అందరిలోకంటే నేనే తోపంటూ చాలా మంది సవాలు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్లు అంతా ఈ టెస్ట్ లో పాస్ అవుతారో లేదో చెక్ చేసుకోండి. ఇంతకీ ఆయన పెట్టిన టెస్ట్ ఎంతో తెలుసుకుందాం.
సాధారణంగా ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఏది షేర్ చేసినా అది ఎంతో ఆసక్తికరంగా, అందరినీ ఆలోచించేదిగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాంటి పోస్టు ఒకటి నెటిజన్ల మెమరీని టెస్ట్ చేస్తూ ఆయన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ఇది ట్రెండింగ్ అవుతోంది. ఒక వ్యక్తి మానసిక వయస్సును నిర్ణయించే పరీక్ష అది. నా స్నేహితుడి కోరిక మేరకు ఈ పరీక్షను ప్రయత్నించి చూశాను. అద్భుతంగా ఉంది. వివాదస్పదమైన ఫలితమేమీ ఇవ్వలేదు అంటూ ఆయన పోస్టుకు క్యాప్షన్ ఇచ్చారు మహీంద్రా గ్రూప్స్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా.
ప్రస్తుతం మాత్రం ఈ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడమే కాదు.. ఎంతో మంది తమ మెమరీని పరీక్షించుకుంటున్నారు. అసలు ఆ పోస్టులో చిన్న చిన్న తేడాలతో సుమారు ఒకేలా ఉన్న 12 వాక్యాలను ఇచ్చారు. వాటన్నింటినీ ఒక్క తప్పు లేకుండా బయటకు వినిపించేలా చదవాలి. 50 ఏళ్ల వయస్సు దాటిన వారు తప్పకుండా ఈ పరీక్షలో పాసవ్వడం కష్టమని రాసుకొచ్చారు ఆ పోస్టులో, అలాగే ప్రతి వాక్యంలోని మూడో పదాన్ని పై నుంచి కిందికి చదవమన్నారు. ఇది మాత్రం చాలా సులవుగా చదివేయొచ్చు. ఈ పరీక్షను హార్వర్డ్ విశ్వవిద్యాలయం రూపొందించగా, ఈ పరీక్ష తనను ఎంతగానో ఆకట్టుకుందని.. ఓ సారి మీరూ ప్రయత్నించి చూడండి అంటూ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో ఆ పోస్టు చేశారు. మరి ఆలస్యం ఎందుకు మీరు ఒకసారి మీ మెమరీని టెస్ట్ చేసుకుని, పాస్ అయ్యారో, ఫెయిల్ అయ్యారో మీ మార్కులు మీరే వేసుకోండి.
I have to admit that this was a brilliantly accurate test that a friend urged me to take. Indisputable result. pic.twitter.com/y5yQQiXe2L
— anand mahindra (@anandmahindra) October 1, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..