Cream Roll: క్రీమ్ రోల్ అంటే ఇష్టమా..! ఈ వీడియో చూస్తే ఎప్పుడూ వాటి వైపు చూడరు..

కొన్ని వీడియోలు చూస్తే ఎంత ఇష్టమైన ఆహారం అయినా ఇక నుంచి ఎప్పుడు తినకూడదు అని నిర్ణయం తీసుకునేలా చేస్తాయి. ప్రస్తుతం అలాంటి ఓ వీడియో నేట్టింట్లో చక్కర్లు కొడుతోంది. క్రీమ్ రోల్స్ పిల్లలు, పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. అయితే ఈ క్రీమ్ రోల్స్ ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా? అవును.. ప్రస్తుతం క్రీమ్ రోల్స్ తయారు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో క్రీమ్ రోల్ చేసే పద్ధతిని చూపించారు. అయితే తయారీ పద్ధతిని చూసి జనాలు ఉలిక్కిపడ్డారు.

Cream Roll: క్రీమ్ రోల్ అంటే ఇష్టమా..! ఈ వీడియో చూస్తే ఎప్పుడూ వాటి వైపు చూడరు..
Cream Roll Making VideoImage Credit source: Twitter/@Dabbu_1010
Follow us
Surya Kala

|

Updated on: May 30, 2024 | 12:45 PM

ఆహార పదార్థాలకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రకరకాల వంటకాలు తయరు చేస్తున్న వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. వాటిల్లో కొన్ని చూసిన వెంటనే తినాలని అనిపిస్తాయి, కొన్నిసార్లు కొన్ని వింత వంటకాలు కూడా ప్రజల మనస్సులను దోచుకుంటాయి. అదే సమయంలో కొన్ని వీడియోలు చూస్తే ఎంత ఇష్టమైన ఆహారం అయినా ఇక నుంచి ఎప్పుడు తినకూడదు అని నిర్ణయం తీసుకునేలా చేస్తాయి. ప్రస్తుతం అలాంటి ఓ వీడియో నేట్టింట్లో చక్కర్లు కొడుతోంది. క్రీమ్ రోల్స్ పిల్లలు, పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. అయితే ఈ క్రీమ్ రోల్స్ ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా? అవును.. ప్రస్తుతం క్రీమ్ రోల్స్ తయారు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో క్రీమ్ రోల్ చేసే పద్ధతిని చూపించారు. అయితే తయారీ పద్ధతిని చూసి జనాలు ఉలిక్కిపడ్డారు.

పిండిని ముందుగా పొడవగా చపాతీగా చేశారు. తర్వాత దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినట్లు వీడియోలో చూపించారు. ఆ తర్వాత ఆ ముక్కలను రోల్ ఆకారంలో మడతపెట్టి.. ఆపై వాటిని నూనెలో వేయించారు. అవి వేయించి పూర్తిగా క్రంచీగా మారిన తర్వాత వాటిని క్రీమ్ తో నింపారు. అయితే ఇలా క్రీమ్ రోల్‌ను తయారుచేసే విధానంలో ఎక్కడా పరిశుభ్రత పాటించలేదు. చాలా మురికిగా ఉంది. ఇది చూసిన ఎవరైనా సరే మళ్ళీ క్రీమ్ బన్ తినాలంటే ఆలోచిస్తారు. దీన్ని తయారు చేస్తున్న సమయంలో ఎక్కడా పరిశుభ్రతను పాటించలేదు. రోల్ చేయడానికి ఉపయోగించే క్రీమ్‌ను ఉంచిన ప్లాస్టిక్ బకెట్‌ చాలా మురికిగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @Dabbu_1010 పేరుతో IDలో షేర్ చేశారు. ‘క్రీమ్ రోల్‌ను ఎవరు ఇష్టపడతారు?’ అనే శీర్షికను జత చేశారు. కేవలం 57 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 51 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది వీడియోను కూడా లైక్ చేశారు.

అదే సమయంలో వీడియోను చూసిన తర్వాత వినియోగదారులు వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు. ‘నేను దాదాపు అన్ని ప్యాక్డ్ ఆహారాలకు దూరంగా ఉన్నాను ఎందుకంటే అవి కల్తీతో నిండిపోయి ఉన్నాయి కనుక. మన దేశంలో ఆహార భద్రతా చట్టాల పట్ల నిర్లక్ష్యం ప్రబలంగా ఉంది. కల్తీ, పరిశుభ్రత సరిగా లేకపోవడం వంటి సమస్యలు సర్వ సాధారణం. దీని కారణంగా ఆహార భద్రత విషయంలో తక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం మార్కెట్లో నకిలీ క్రీమ్ రోల్స్ అమ్ముడవుతున్నాయి అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..