AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: అప్పగింతల వేళ వధువు ఏడుపు.. నెట్టింట 2కోట్ల మందికి పైగా ఓదార్పు..! విషయం ఏంటంటే..

ఈ వీడియో @ashishkumar29536 అనే ఖాతాతో షేర్‌ చేయబడింది. ఈ వీడియోను ఇప్పటికే ఎనిమిది లక్షల మందికి పైగా లైక్ చేయగా, 2.5 కోట్ల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియోపై వేలాది మంది తమ స్పందనలను తెలియజేశారు.

Watch: అప్పగింతల వేళ వధువు ఏడుపు.. నెట్టింట 2కోట్ల మందికి పైగా ఓదార్పు..! విషయం ఏంటంటే..
Bride Crying With Pet Dog
Jyothi Gadda
|

Updated on: May 30, 2024 | 12:33 PM

Share

Bride With Dog Viral Video : పెళ్లికి సంబంధించిన ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో అనేకం వైరల్ అవుతుంటాయి. అయితే కూడా ఒక ఆసక్తికరమైన వీడియో వైరల్ అవుతోంది. పెళ్లి తంతూ పూర్తై వధువుకు అప్పగింతలు అవుతున్న వేళ జరిగిన సన్నివేశానికి అందరూ ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. పుట్టింట్లో వధువుకు వీడ్కోలు సమయంలో అమ్మాయిలు తమ తల్లిదండ్రులు,తోబుట్టువులను పట్టుకుని ఏడుస్తూ అత్తవారింటికి బయల్దేరుతారు. వారు భావోద్వేగానికి గురైనప్పుడు, వారు తమ సన్నిహితులను పట్టుకుని మరింత రోధిస్తారు. ఇక్కడ కూడా అలాగే, వీడ్కోలు సమయంలో ఒక అమ్మాయి కుక్కను పట్టుకుని ఏడుస్తూ కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్‌ అవుతోంది.

పెంపుడు జంతువుల పట్ల తమ యజమానులు ఎంతో ప్రేమను చూపిస్తుంటారు. ఎక్కువ మంది వారి ఇళ్లల్లో కుక్క, పిల్లి వంటివి పెంచుకుంటారు. ఇంటిల్లిపాది వాటితో ఎక్కువ అటాచ్ అవుతారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, ఒక అమ్మాయి తన పెళ్లి అనంతరం అత్తవారింటికి బయలుదేరినప్పుడు ఇంట్లోని పెంపుడు కుక్కను పట్టుకుని ఏడవడం ప్రారంభించింది.

వైరల్‌ వీడియోలో పెళ్లి కూతురు ముస్తాబులో ఉన్న వధువు కారులో కూర్చుని ఉంది. ఒడిలో తమ పెంపుడు కుక్కను పట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఇదంతా అక్కడున్న వారు వీడియో తీయగా, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆ అమ్మాయి తమ పెంపుడు కుక్కతో ఉన్న అనుబంధాన్ని ప్రశంసిస్తున్నారు. జంతువులను ప్రేమించే వారు మాత్రమే ఈ బాధను అర్థం చేసుకోగలరని సోషల్ మీడియా వినియోగదారు ఒకరు రాశారు. ఆ కుక్కను తనతో పాటే తీసుకెళ్లవచ్చునని కొందరు అంటున్నారు.

ఈ వీడియో @ashishkumar29536 అనే ఖాతాతో షేర్‌ చేయబడింది. ఈ వీడియోను ఇప్పటికే ఎనిమిది లక్షల మందికి పైగా లైక్ చేయగా, 2.5 కోట్ల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియోపై వేలాది మంది తమ స్పందనలను తెలియజేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..