Viral Video: చెట్టుపై చిక్కుకున్న ఆవు.. దించేందుకు ప్రయత్నించిన రెస్క్యూ టీమ్.. వీడియో చూస్తే షాక్ అవుతారు..

uppula Raju

uppula Raju |

Updated on: Sep 02, 2021 | 4:20 PM

Viral Video: ఇడా హరికేన్ అమెరికాలో ఎంతటి విధ్వంసం సృష్టించిందో అందరికి తెలిసిందే. తుఫాను తరువాత రెస్క్యూ టీమ్ ప్రజలను రక్షించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

Viral Video: చెట్టుపై చిక్కుకున్న ఆవు.. దించేందుకు ప్రయత్నించిన రెస్క్యూ టీమ్.. వీడియో చూస్తే షాక్ అవుతారు..
Viral Video

Follow us on

Viral Video: ఇడా హరికేన్ అమెరికాలో ఎంతటి విధ్వంసం సృష్టించిందో అందరికి తెలిసిందే. తుఫాను తరువాత రెస్క్యూ టీమ్ ప్రజలను రక్షించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ సందర్భంలో రెస్క్యూ టీం ఆవును రక్షించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవానికి వరద నీటితో కొట్టుకుపోయిన ఆవు ఒకటి చెట్టుపై చిక్కుకుంది. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు దానిని సురక్షితంగా కిందకు దించి ప్రాణాలు కాపాడుతారు. దీంతో వారిపై సోషల్‌ మీడియాలో ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఈ వీడియోను @SkyNews సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘న్యూ ఓర్లీన్స్ సమీపంలో చెట్టు సందులో చిక్కుకున్న ఆవును కొంతమంది సురక్షితంగా రక్షించారు. ఇడా హరికేన్ కారణంగా వచ్చిన తీవ్రమైన వరద కారణంగా ఆవు చెట్టు మధ్యలో చిక్కుకుంది. ఈ వీడియో ఇప్పటివరకు 27 వేల మందికి పైగా చూశారు. ఒక నివేదిక ప్రకారం.. ఆవు వరద నీటిలో కొట్టుకొని వచ్చి ఈ ప్రదేశానికి చేరింది. ఒక దట్టమైన చెట్టు కొమ్మల మధ్య చిక్కుకుంది. రెస్క్యూ టీమ్ దానిని గమనించినప్పుడు చెట్టుపై ఎటూ కదలని పరిస్థితిలో అల్లాడుతుంది. వెంటనే స్పందించిన రెస్క్యూటీం దానిని కిందికి దించే పనిని ప్రారంభించారు.

ఈ 33-సెకన్ల క్లిప్‌లో చెట్టు కొమ్మలను కత్తిరించడం ద్వారా ఇద్దరు వ్యక్తులు ఆవును ఎలా కిందికి దించారో మనం చూడవచ్చు. అమెరికా గల్ఫ్ తీరాన్ని తాకిన అత్యంత శక్తివంతమైన తుఫానులలో ఇడా హరికేన్ ఒకటి. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న చిత్రాలు, వీడియోలలో తుఫాను వల్ల జరిగిన నష్టం స్పష్టంగా కనిపిస్తుంది. చాలా చోట్ల తుఫాను ప్రమాదకరమైన విధ్వంసానికి కారణమైంది. దీని కారణంగా ఆ ప్రదేశాలను గుర్తించడం చాలా కష్టమవుతోంది.

ఆర్మీ హెలికాప్టర్‌లో తాలిబన్ల సెల్ఫీలు..!మితిమీరిన తాలిబన్ల ఆగడాలు..: Thalibans in army Helicopter video.

Chinnari Pelli Kuturu: ఒకప్పుడు బుల్లితెరపై సంచలనం ‘చిన్నారి పెళ్లికూతురు’.. వరస మరణాల కలకలం

ఇండియా మంచానికి న్యూజిల్యాండ్‌లో భలే గిరాకీ.. ఎంతకీ కొన్నారో తెలిస్తే షాకే..:India Bed Video.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu