Viral Video: రౌడీ బేబీ పాటకు అదిరిపోయే స్టెప్పులు.. టాలెంట్‌కు అదుర్స్ అనాల్సిందే.. రెండు కళ్లు చాలవు..
తమిళ్ స్టార్ ధనుష్, సాయిపల్లవి కాంబోలో వచ్చిన మారి 2 చిత్రంలోని ఈ సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ పాటకు ప్రభుదేవా కొరియోగ్రాఫి అందించగా.. ధనుష్, సాయి పల్లవి అద్భుతమైన స్టెప్లులతో అదరగొట్టారు.

రౌడీ బేబీ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేసింది. ఈ పాటకు జోరు ఇప్పటికీ తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న పాటలలో రౌడీ బేబీ ఒకటి. తమిళ్ స్టార్ ధనుష్, సాయిపల్లవి కాంబోలో వచ్చిన మారి 2 చిత్రంలోని ఈ సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ పాటకు ప్రభుదేవా కొరియోగ్రాఫి అందించగా.. ధనుష్, సాయి పల్లవి అద్భుతమైన స్టెప్లులతో అదరగొట్టారు. అయితే సోషల్ మీడియాలో ఈ సాంగ్ పై చిన్న పెద్ద అనే తేడా లేకుండా స్టెప్పులేశారు. తాజాగా కోల్ కత్తాకు చెందిన ఓ జంట రౌడీ బేబీ పాటకు సూపర్ గా డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంంధఇంచిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
కోల్ కత్తాకు చెందిన కొరియోగ్రాఫర్స్ సౌరభ్, అనూష.. మారి 2 చిత్రంలో ధనుష్, సాయి పల్లవి ధరించినటువంటి దుస్తులు ధరించి రౌడీ బేబీ పాటకు అద్భుతంగా స్టెప్పులేశారు. అచ్చంగా సాయి పల్లవి, ధనుష్ చేసిన స్టెప్పులను ఎంతో హూషారుగా చేస్తూ కనిపించారు. వీరి డ్యాన్స్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. రౌడీ బేబీస్ రాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ డ్యాన్స్ 90 శాతం మ్యాచ్ అవుతుందని అనుకుంటున్నాము అంటూ @jodianoorabh ఇన్ స్టా ఖాతాలో వీరి డ్యాన్స్ వీడియోను షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. సూపర్, కోలీవుడ్ గొప్ప డ్యాన్సర్లు.. కానీ మీరు కూడా గొప్పగా అనేలా చేశారు.. రాకింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.




View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
