Condom Sales: అక్కడ కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే.!
ఎంకి పెళ్లి.. సుబ్బి చావుకు వచ్చినట్లు.. ఉక్రెయిన్‌పై యుద్ధం రష్యన్లకు కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. అక్కడి జనం అవసరానికి మించి...
ఎంకి పెళ్లి.. సుబ్బి చావుకు వచ్చినట్లు.. ఉక్రెయిన్‌పై యుద్ధం రష్యన్లకు కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. అక్కడి జనం అవసరానికి మించి కండోమ్‌లు కొనేస్తున్నారట. ఇదేంటి కండోమ్స్ కొనడం అని ఆలోచిస్తున్నారా.? వెయిట్ చేయండి.. ఈ స్టోరీ చదివితే మీకే అర్ధమవుతుంది.
ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ.. అమెరికాతో సహా వివిధ దేశాలు.. రష్యాపై ఆర్ధిక ఆంక్షలు విధించాయి. మరీ ముఖ్యంగా యూరోపియన్ దేశాలు రష్యాతో వాణిజ్య సంబంధాలు తెంచేసుకున్నాయి. దీనితో ఆ దేశంలో కండోమ్‌ల కొరత ఏర్పడుతుందంటూ పుకార్లు మొదలయ్యాయట. ఇంకేముంది రష్యన్లు తమ భవిష్యత్తు అవసరాల కోసమని కండోమ్‌లు ఎగబడి మరీ కొనేస్తున్నారట. దీనితో అక్కడి సూపర్ మార్కెట్లు, మెడికల్ షాపుల్లో కండోమ్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయట. గతేడాది మార్చితో పోలిస్తే ఈ మార్చి మొదటి 15 రోజుల్లోనే రష్యాలో కండోమ్స్ అమ్మకాలు 170 శాతం పెరిగాయని కండోమ్స్ తయారు చేసే రెకిట్ సంస్థ తెలిపింది. అలాగే ఇప్పటివరకు జరిగిన కండోమ్స్ అమ్మకాలతో పోల్చితే ఈ ఏడాది 36 శాతం పెరుగుదల ఉందని పేర్కొంది.
కాగా, కండోమ్స్ భారీగా అమ్ముడుపోతుండటంతో అక్కడి మార్కెట్ నిపుణులు స్పందించారు. కండోమ్ తయారీలో ఉపయోగించే లేటెక్స్ పదార్ధాన్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. యుద్ధం కారణంగా డాలర్‌తో పోలిస్తే రూబుల్ విలువ భారీగా పడిపోయింది. దీనితో రష్యాలో ఏ వస్తువుకు డిమాండ్ ఉన్నా.. ఎక్కువ రేటుకు అమ్ముతూ షాపుల ఓనర్లు సాధ్యమైనంత లాభాలు పొందుతున్నామన్నారు.