AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: హాలీడేస్‌లో అసైన్‌మెంట్స్.. స్టూడెంట్స్‌కు కాదండోయ్.. ఆలోజింపజేస్తున్న ప్రైవేటు పాఠశాల నిర్ణయం..

విద్యార్థులకు ప్రస్తుతం పరీక్షలు పూర్తవుతున్నాయి. కొన్ని చోట్ల ఇప్పటికే వేసవి సెలువులు సైతం ప్రకటించారు. మొన్నటి వరకు పుస్తకాలతో కుస్తీలు పడ్డ విద్యార్థులు సమ్మర్‌ హాలీడేస్‌ ఎంజాయ్‌ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే వేసవి సెలవుల్లోనూ విద్యార్థులకు పాఠశాలలు కొన్ని అసైన్‌మెంట్స్‌ ఇస్తుంటారు...

Viral: హాలీడేస్‌లో అసైన్‌మెంట్స్.. స్టూడెంట్స్‌కు కాదండోయ్.. ఆలోజింపజేస్తున్న ప్రైవేటు పాఠశాల నిర్ణయం..
Representative Image
Narender Vaitla
|

Updated on: Apr 04, 2023 | 5:03 PM

Share

విద్యార్థులకు ప్రస్తుతం పరీక్షలు పూర్తవుతున్నాయి. కొన్ని చోట్ల ఇప్పటికే వేసవి సెలువులు సైతం ప్రకటించారు. మొన్నటి వరకు పుస్తకాలతో కుస్తీలు పడ్డ విద్యార్థులు సమ్మర్‌ హాలీడేస్‌ ఎంజాయ్‌ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉంటే వేసవి సెలవుల్లోనూ విద్యార్థులకు పాఠశాలలు కొన్ని అసైన్‌మెంట్స్‌ ఇస్తుంటారు. ప్రాజెక్ట్ వర్క్‌లతో పేరుతో విద్యార్థులకు సమ్మర్‌లో బిజీగా ఉండేలా చేస్తాయి.

సాధారణంగా విద్యార్థులకు అసైన్‌మెంట్స్‌ ఇస్తుంటారు కదూ.! అయితే ఓ పాఠశాల మాత్రం విద్యార్థుల తల్లిదండ్రులకు అసైన్‌మెంట్ వర్క్‌ ఇచ్చింది. అదేంటి పేరెంట్స్‌కి అసైన్‌మెంట్ వర్క్‌ ఏంటని ఆలోచిస్తున్నారు కదూ.. కొయంబత్తూర్‌కి చెందిన ఓ ప్రైవేటు పాఠశాల విద్యార్థుల పేరెంట్స్‌కి హాలీడే అసైన్‌మెంట్ పేరుతో కొన్ని సూచనలు చేసింది. ఇంతకీ ఆ పాయింట్స్‌ ఏంటంటే..

* మీ చిన్నారులతో కలిసి రోజులో కనీసం రెండుసార్లు భోజనం చేయండి. ఆహారం పండించడానికి రైతులు ఎంత శ్రమకొడుస్తారో చెప్పండి. ఆహారాన్ని వృథా చేయకూడదని వారికి సూచించండి.

ఇవి కూడా చదవండి

* భోజనం చేసిన తర్వాత పిల్లల ప్లేట్లను వారే శుభ్రం చేసుకునేలా నేర్పించండి. దీనిద్వారా పిల్లలకు డిగ్నిటీ ఆఫ్‌ లేబర్‌ అంటే ఏంటో తెలిసేలా చేయొచ్చు.

* మీరు వంట చేసే సమయంలో పిల్లలను మీకు సహాయం చేయమనండి. వారికి కావాల్సిన ఫ్రూట్‌సలాడ్స్‌ వంటి వాటిని వారితోనే తయారు చేయించండి.

* ప్రతీరోజూ మూడు కొత్త ఇంగ్లిష్‌ పదాలను నేర్చుకోమనండి. వాటిని నోట్‌ బుక్‌లో రాసుకోమనండి.

* ప్రతిరోజూ ఇంటి సమీపంలో ఉన్న ముగ్గురు ఇరుగుపొరుగు వారిని పిల్లలకు పరిచయం చేయించండి.

* సమ్మర్ హాలీడేస్‌లో కచ్చితంగా తాతయ్య, బామ్మల దగ్గరికి పిల్లల్ని తీసుకెళ్లండి. పెద్దవారితో బంధం చిన్నారులకు చాలా అవసరం.

* వీలైతే మీ చిన్నారులను మీరు పనిచేసే ప్రదేశానికి తీసుకెళ్లండి. కుటుంబం కోసం మీరు ఎంతలా కష్టపడుతున్నారో వివరించండి.

* లోకల్‌ మార్కెట్‌ను సందర్శించండి. గ్రామాల్లో జరిగే వేడుకలకు తీసుకెళ్లండి.

* మీ పిల్లలతో మొక్కలు పెంచడం నేర్పించండి.

* మీ కుటంబ చరిత్ర, మీ చిన్నతనంలో ఎదురైన అనుభవాలను చిన్నారులతో పంచుకోండి.

* ఎప్పడూ స్మార్ట్‌ ఫోన్స్‌తో కాకుండా వీలైనంత వరకు బయట ఆడుకునే వీలును కల్పించండి.

* పెట్‌ డాగ్‌, పిల్లి, ఏదైనా పక్షి, లేదా చివరికి ఒక చేప పిల్లలను పెంచే బాధ్యత వారికి అప్పగించండి.

Viral News

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..