AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Himalayan Yogi: అజ్ఞాత ‘హిమాలయ యోగి’తో చిత్రా రామకృష్ణ ఈ- మెయిల్ చాటింగ్.. SEBI దర్యాప్తులో వెలుగులోకి షాకింగ్ విషయాలు

భారతదేశంలోని ప్రధాన స్టాక్ ఎక్ఛేంజ్ NSE. దీని మార్కెట్ విలువ 4 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు. దీనికి చిత్రా రామకృష్ణ(Chitra ramakrishna) గతంలో సీఈఓ, ఎండీ గా వ్యవహరించారు. దేశ పారిశ్రామిక వర్గాల్లో ఈమెకు సంబంధించిన వార్త హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే..

Himalayan Yogi: అజ్ఞాత 'హిమాలయ యోగి'తో చిత్రా రామకృష్ణ ఈ- మెయిల్ చాటింగ్.. SEBI దర్యాప్తులో వెలుగులోకి షాకింగ్ విషయాలు
Chitra Ramakrishna
Ayyappa Mamidi
|

Updated on: Feb 15, 2022 | 1:35 PM

Share

Himalayan Yogi: భారతదేశంలోని ప్రధాన స్టాక్ ఎక్ఛేంజ్ NSE. దీని మార్కెట్ విలువ 4 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు. దీనికి చిత్రా రామకృష్ణ(Chitra ramakrishna) గతంలో సీఈఓ, ఎండీ గా వ్యవహరించారు. దేశ పారిశ్రామిక వర్గాల్లో ఈమెకు సంబంధించిన వార్త హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. అజ్ఞాత హిమాలయన్ యోగి(Himalayan Yogi) ని చిత్రా రామకృష్ణ “శిరోమణి” అని పిలిచేవారు. ఎన్ఎస్ఈకి సంబంధించిన ఫైనాన్షియల్ డేటా, డివిడెండ్ నిష్పత్తులు, వ్యాపార ప్రణాళికలు, బోర్డు మీటింగ్ ఎజెండా మరియు ఉద్యోగి పనితీరు అంచనాల వంటి పూర్తి వివరాలను.. చిత్ర 5 ఏళ్ల పదవీకాలంలో సదరు యోగితో పంచుకున్నారు. కో-లొకేషన్, ఆల్గో ట్రేడింగ్ కుంభకోణం, సుబ్రమణియన్(Subramaniyan) నియామకంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు.. చిత్రా రామకృష్ణ 2016లో NSE నుంచి తొలగించబడ్డారు. ఇస్టాను సారంగా చిత్రా రామకృష్ణ ఎన్ఎస్ఈని నిర్వహించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సెబీ ఇన్వెస్టిగేషన్ లో ఆమె వ్యవహారానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. చిత్రా తన పదవీ కాలంలో రహస్యంగా ఉంచవలసిన అనేక విషయాలను ఈ మెయిల్స్ రూపంలో సదరు అజ్ఞాత యోగితో పంచుకున్నట్లు బయటపడింది.

సుబ్రమణియన్‌ నియామకంలో అవకతవకలు..

గడచిన 20 సంవత్సరాల్లో చిత్రాను ఎప్పుడూ కలవని ఆ యోగి ఆనంద్‌ సుబ్రమణియన్‌ నియామకం వెనుక ఉన్నారు. అసలు 2013 లో చీఫ్ స్ట్రాటజిక్ కన్సల్టెంట్ గా ఎన్ఎస్ఈలో ఏడాదికి రూ. 1.68 కోట్ల జీతానికి చేరిన సుబ్రమణియన్.. యోగి సూచనల మేరకు స్టాక్ ఎక్ఛేంజ్ లో రెండవ అతి ముఖ్యమైన అధికారిగా మారారు. ఈ నిర్ణయం వల్ల సంస్థకు రూ. 5 కోట్ల మేర నష్టం జరిగింది. కేవలం వారాల వ్యవధిలోనే ఇదంతా జరిగిపోయింది. 2013లో దిల్లీలోని ఒక శక్తివంతమైన రాజకీయ నాయకుడి మద్దతుతో చిత్రా రామకృష్ణ ఎన్‌ఎస్‌ఈకి ఎండీ, సీఈఓగా నియమితులయ్యారని బిజినెస్ లైన్‌కి విస్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎన్‌ఎస్‌ఈ వీరిద్దరికీ కేటాయించిన ల్యాప్‌టాప్‌లను ఈ-వేస్ట్‌గా తొలగించింది. ఫోరెన్సిక్ ఆడిట్ కోసం వారి వ్యక్తిగత ఇమెయిల్‌లు కూడా అందుబాటులో లేవు.

కానీ మెయిల్ సంభాషణలు, సెబీ చెబుతున్నవి వేరే విధంగా ఉన్నాయి..

చిత్రారామకృష్ణకు ఆధ్యాత్మిక గురువుగా వ్యవహరించిన వ్యక్తి ఆమె శిరోజాలపైనా ఆసక్తి చూపారు. జడను కనుక వేర్వేరు రకాలుగా వేస్తే ఇంకా బాగుంటావనీ ఆమెకు సూచించారు. ఆమెతో కొన్ని పాటలు పంచుకున్నారు. ఇద్దరూ కలిసి తూర్పు ఆఫ్రికాలోని దీవి అయిన సీషెల్స్‌కు వెళ్లారనీ సెబీ వెల్లడించింది. తమకు చిత్రా రామకృష్ణ ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు పూర్తి విరుద్ధంగా ఇవి ఉన్నాయని సెబీ పేర్కొంది. తన ఆధ్యాత్మిక గురు ఒక ‘సిద్ధ పురుషుడు’ లేదా పరమహంస’ అని.. ఎటువంటి భౌతిక రూపం లేదని.. ఆయన కోరిన రూపాన్ని ధరించగలరని చిత్రా రామకృష్ణ సెబీకి తెలిపారు. ఆయన హిమాలయా పర్వతాల్లో ఉంటారని.. గత 20 ఏళ్లుగా ఆయన తన వ్యక్తిగత, వృత్తిగత అంశాల్లో మార్గనిర్దేశం చేశారని ఆమె సెబీకి వివరించారు.

మెయిల్స్ లో మ్యాటర్ ఇలా ఉంది.. 

‘గుర్తుతెలియని వ్యక్తి’, చిత్రా రామకృష్ణకు మధ్య జరిగిన ఈ మెయిల్స్ సారాశం ప్రకారం.. 2015లో ఆ వ్యక్తి, చిత్రా రామకృష్ణ పలుమార్లు కలుసుకున్నారు. ఆ వ్యక్తి ఎవరో తెలపడానికి ఆమె నిరాకరించారని.. ఆ వ్యక్తి ఒక ఆధ్యాత్మిక శక్తి అని మాత్రమే తెలిపారని సెబీ వివరించింది. ప్రతి మెయిల్‌ వివరాలనూ వెల్లడించలేం కానీ.. ఆ వ్యక్తి ఒక మనిషేనని, చిత్రా రామకృష్ణతో కలిసి పలు ప్రాంతాలకు ‘చిల్‌’ కావడానికి వెళ్లారని సెబీ తెలిపింది. 2013 ఏప్రిల్‌ నుంచి 2016 డిసెంబరు వరకు ఎన్‌ఎస్‌ఈఓ ఎండీ, సీఈఓగా చిత్రా రామకృష్ణ పనిచేశారు. హిమాలయ యోగిని ‘శిరోన్మణి’గా ఆమె అభివర్ణించారు. 2018 ఏప్రిల్‌లో సెబీకి ఆమె ఇచ్చిన వివరాల ప్రకారం.. దిల్లీలోని స్వామిమలై ఆలయంలో ‘గుర్తుతెలియని వ్యక్తి’ని ఆమె కలిశారు. పలు పవిత్ర స్థలాల్లోనూ పలుమార్లు కలుసుకున్నారు. మరో మెయిల్ సంభాషణలో.. మార్చి మధ్యలో కాస్త విరామం ఉండేలా చూసుకో’ అని ఉంది. అంతకు ముందు రోజు మెయిల్‌లో ‘నీ బ్యాగులు సిద్ధం చేసుకో. వచ్చే నెల సీషెల్స్‌కు వెళ్లడానికి ప్రణాళికలు వేస్తున్నా. నీకు వీలుంటే నాతో రావొచ్చు. ఇదంతా కాంచన, భార్గవలతో కంచన్‌(సుబ్రమణియన్‌) లండన్‌కు వెళ్లే ముందు; నువ్వు న్యూజిలాండ్‌కు వెళ్లే ముందు జరుగుతుంది. మనం వెళ్లేదారిలో హాంకాంగ్‌ లేదా సింగపూర్‌లో ఆగొచ్చు. నీకేదైనా సహాయం కావాలంటే చెప్పు. శేషు అవన్నీ చూసుకుంటారు. నీకు ఈత తెలిస్తే సముద్ర స్నానం చేయొచ్చు. టికెట్ల కోసం కంచన్‌తో మాట్లాడమని నా టూర్‌ ఆపరేటరుకు చెప్పా’ అని ఉంది.

పాట విన్నావా అంటూ..

2015 సెప్టెంబరు 16 నాటి ఇ-మెయిల్‌లో అయితే ‘నేను పంపిన మకర కుండల పాట విన్నావా? వాటిని కచ్చితంగా వినాలి. నీ మది నుంచి నీ మోముపైకి వచ్చే చిరునవ్వును చూస్తున్నపుడు నాకు ఆనందంగా ఉంటుంది. నిన్న సమయాన్ని పంచుకోవడం సంతోషంగా ఉంది. నీకోసం నువ్వు చేసే ఈ చిన్నచిన్న విషయాలు నిన్ను శక్తిమంతంగా, తక్కువ వయస్సు అనిపించేలా చేస్తుంది’ అని రాసి ఉంది.

ఇవీ చదవండి.. 

Golden Visa: యూఏఈలో భారతీయుడికి అరుదైన గౌరవం.. ఆయనకే తొలిసారిగా..

Post Office: ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు.. పెట్టుబడి సురక్షితం.. పోస్టాఫీసులో FD ఖాతాను ఇలా తెరవవచ్చు..