Viral Video: యమ ధర్మరాజే వదిలేశాడేమో.. క్షణ కాలంలో ప్రాణాలు సేఫ్.. వీడియో చూస్తే గుండె జల్లుమనడం ఖాయం..!

Viral Video: రైలు ప్రమాదం ఎంత భయంకరంగా ఉంటుందో అనేక సందర్భాల్లో చూసాం. రైలు ఢీకొంటే పెద్ద పెద్ద వాహనాలు సైతం తునాతునకలైపోతాయి.

Viral Video: యమ ధర్మరాజే వదిలేశాడేమో.. క్షణ కాలంలో ప్రాణాలు సేఫ్.. వీడియో చూస్తే గుండె జల్లుమనడం ఖాయం..!
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 15, 2022 | 1:42 PM

Viral Video: రైలు ప్రమాదం ఎంత భయంకరంగా ఉంటుందో అనేక సందర్భాల్లో చూసాం. రైలు ఢీకొంటే పెద్ద పెద్ద వాహనాలు సైతం తునాతునకలైపోతాయి. అలాంటి ఘటనలు దేశ విదేశాల్లో ఎన్నో చోటు చేసుకున్నాయి. తాజాగా అలాంటి భయానక వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి రెప్పపాటు కాలంలో ప్రాణాలతో బయటపడ్డాడు. అతను ప్రయాణించిన బైక్ సెకన్లలోనే నుజ్జు నుజ్జు అవ్వగా.. అతను మాత్రం సేఫ్‌గా ఉన్నాడు.

ఈ వైరల్ వీడియోలో ట్రాక్ కమ్ రోడ్ ఉంది. రైలు వస్తుండగా గేట్ వేశారు అధికారులు. అయితే, కొందరు మాత్రం అలాగే ట్రైన్ ట్రాక్ దాటేందుకు యత్నించారు. ఇంతలో ఓ యువకుడు తన బైక్‌పై రయ్‌మని దూసుకువచ్చాడు. కానీ, అంతలోనే ట్రైన్ సమీపించింది. వెంటనే అప్రమత్తమైన ఆ యువకుడు బైక్‌ను వదలి వెనక్కి రాబోయాడు. కానీ, ఇంతలో దూసుకువచ్చిన ట్రైన్.. నేరుగా అతని బైక్‌ను ఢీకొట్టింది. ట్రైన్ దాటికి బైక్ ముక్కలు ముక్కలు అయ్యింది. అదృష్టం కొద్ది అతను ఇటువైను దూకేశాడు. దాంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

ఈ షాకింగ్ ఘటన రైల్వే గేట్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డ్ అవగా.. దానిని Rajendra B. Aklekar(@rajtoday) ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దాంతో ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. కాగా, ఈ ఘటన ముంబైలో జరుగగా.. అందులోని ట్రైన్ రాజధానిగా ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌గా తెలుస్తోంది. సెకన్ల వ్యవధిలో ప్రాణాలతో బయటపడిన ఈ ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో నెటిజన్లను మైండ్ బ్లాంక్ చేస్తోంది. ఈ వీడియోను ఇప్పటి వరకు 3.7 లక్షల మంది వీక్షించారు.

Viral Video:

Also read:

Viral Video: మాంచి ఆకలి మీదున్న పక్షి.. జింకను అత్యంత క్రూరంగా వేటాడేసింది.. షాకింగ్ వీడియో మీకోసం..

Manuguru Municipality: కమిషనర్‌ కుర్చీ కోసం పొట్టు పొట్టుగా కొట్టుకున్న అధికారులు.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన కలెక్టర్..

Liquor Shops Offer: ఒక బాటిల్ కొంటే మరొకటి ఉచితం.. మద్యం షాపుల బంపర్ ఆఫర్..!