Viral Video: మాంచి ఆకలి మీదున్న పక్షి.. జింకను అత్యంత క్రూరంగా వేటాడేసింది.. షాకింగ్ వీడియో మీకోసం..
Viral Video: ఆకలి ఎంతకైనా తెగించే శక్తినిస్తుందని అంటారు. అది మనిషి అయినా, జంతువైనా, పక్షి అయినా ఈ నియమం వర్తిస్తుందట. తాజాగా దానికి నిదర్శనమైన ఘటన..
Viral Video: ఆకలి ఎంతకైనా తెగించే శక్తినిస్తుందని అంటారు. అది మనిషి అయినా, జంతువైనా, పక్షి అయినా ఈ నియమం వర్తిస్తుందట. తాజాగా దానికి నిదర్శనమైన ఘటన సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోంది. మాంచి ఆకలిమీదున్న గద్ద ఏకంగా ఓ భారీ జింకను టార్గెట్ చేసుకుంది. టార్గెట్ చేసుకోవడమే కాదు.. ఊహించని రీతిలో దానిపై అటాక్ చేసింది. అంతపెద్ద జింకను క్షణాల్లో నేలకూల్చింది. దీనికి సంబంధించిన షాకింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
సాధారణంగా గద్దలు చిన్న చిన్న పక్షులు, సరిసృపాలు, చిన్న చిన్న జంతువలను వేటాడుతాయనే విషయం తెలిసిందే. ఆకాశంలో విహరిస్తూ భూమిపై ఉన్న తన ఆహారాన్ని గుర్తించి చటుక్కు ఎత్తుకెళ్తాయి. మరి అదే గద్ద.. తనకంటే ఎన్నో రెట్లు పెద్దదైన జంతువును వేటాడటం ఎప్పుడైనా చూశారా? అది ఓ భారీ జింకను గద్ద వేటాడి నేలకూల్చడం చూశారా? పోనీ విననైనా విన్నారా? అంటే చాలా మంది నో అనే అంటారు. కానీ, ఇక్కడ ఓ గద్ద జింకను వేటాడింది. క్షణాల్లో దాన్ని నేలకూల్చింది. తన పదునైనా ముక్కు, కాళ్లతో దాడి చేసి కుప్పకూలీలే చేసింది ఆ గద్ద. అవును.. అడవిలో ప్రశాంతంగా మేత మేస్తున్న జింకపై ఒక్కసారిగా దూసుకొచ్చిన గద్ద ఊహించని రీతిలో దాడి చేసింది. పదునైన కాలి గోర్లతో, ముక్కుతో జింక ముఖంపై దాడి చేసింది. ఆ దెబ్బకు జింక కళ్లు తీవ్రంగా దెబ్బతినడంతో నిస్సహాయ స్థితిలో పడిపోయింది. అదే అదునుగా భావించిన గద్ద.. తీవ్రంగా దాడి చేసి జింకను నేలకూల్చింది.
ఈ షాకింగ్ వీడియోను వైల్డ్ యూనివర్స్ అనే ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్‌లో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. ‘‘ఈ పక్షి ఆకలి, దాని లక్ష్యం ఏ రేంజ్‌లో ఊహించుకోవచ్చు. తన ఆహారం బలహీనంగా ఉందా? బలంగా ఉందా అని చెక్ చేయడానికి వచ్చింది.’’ అంటూ క్యాప్షన్ పెట్టారు. కాగా, ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఒక చిన్నపాటి గద్ద అంతపెద్ద జింకను సునాయాసంగా పడగొట్టడంపై నొరెళ్లబెడుతున్నారు. దాని దాడిని చూసి అవాక్కవుతున్నారు. ఈ షాకింగ్ వీడియోను మీరూ చూసేయండి.
Viral Video:
View this post on Instagram
Also read:
Liquor Shops Offer: ఒక బాటిల్ కొంటే మరొకటి ఉచితం.. మద్యం షాపుల బంపర్ ఆఫర్..!
TTD News: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఆఫ్ లైన్‌లో సర్వ దర్శనం టికెట్స్ జారీ..