AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వీడెం మనిషిరా సామి.. భారీ కొండచిలువతో గేమ్స్.. ఏకంగా బైక్‌కు కట్టి.!

పాములను చూస్తూనే సగం జడుసుకుంటాం.. అలాంటిది భారీ కొండచిలువను చూస్తే.. ఆమడ దూరం వెళ్తాం. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌లో జరిగిన ఒక షాకింగ్ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది . ఈ వీడియోలో, ఒక యువకుడు తన బైక్‌కు తాడుతో కట్టిన భారీ కొండచిలువను లాక్కెళ్లిపోయాడు.

Viral Video: వీడెం మనిషిరా సామి.. భారీ కొండచిలువతో గేమ్స్.. ఏకంగా బైక్‌కు కట్టి.!
Python Tied To Bike
Balaraju Goud
|

Updated on: Aug 01, 2025 | 12:54 PM

Share

పాములను చూస్తూనే సగం జడుసుకుంటాం.. అలాంటిది భారీ కొండచిలువను చూస్తే.. ఆమడ దూరం వెళ్తాం. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌లో జరిగిన ఒక షాకింగ్ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది . ఈ వీడియోలో, ఒక యువకుడు తన బైక్‌కు తాడుతో కట్టిన భారీ కొండచిలువను లాక్కెళ్లిపోయాడు. ఈ సంఘటన ఇంటర్నెట్‌లో చర్చనీయాంశంగా మారింది. చాలా మంది నెటిజన్లు దానిపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు .

బలవంతంగా కొండచిలువను రోడ్డుపైకి లాగుతున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ యువకుడు ఆ కొండచిలువను బైక్ వెనుక తాడుతో కట్టి ఎక్కడికో ఈడ్చుకెళ్తున్నాడు. దీన్నంతటిని వెనకాలే వస్తున్న కారులో వ్యక్తులు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అదీకాస్త వైరల్ మారడంతో తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ సంఘటన చూసిన తర్వాత కొంతమంది భయపడ్డారు. అయితే చాలామంది దీనిని జంతువుల పట్ల క్రూరత్వంగా భావిస్తున్నారు.

ఈ వీడియో వైరల్ అయిన వెంటనే, చాలా మంది స్థానిక అధికారులు, అటవీ శాఖ సిబ్బంది వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో, ఈ యువకుడిని ఇలా చేయడానికి ఎవరు అనుమతించారని నెటిజన్లు నిలదీశారు. “ఇది జంతు హక్కులను ప్రత్యక్షంగా ఉల్లంఘించడం”, “అలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి” అని చాలా మంది వీడియోపై వ్యాఖ్యానించారు .

ఈ విషయంపై అటవీ శాఖ దర్యాప్తు ప్రారంభించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ కొండచిలువ కనిపించిన అడవికి సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఆ కొండచిలువను గ్రామం నుండి దూరంగా తీసుకెళ్లి, ఎవరికీ హాని కలిగించకుండా.. దూరంగా వదిలివేయాలనుకున్నానని ఆ యువకుడు పేర్కొన్నాడు. అయినప్పటికీ, ఇలా జంతువులను లాగడం చట్టపరమైన నేరమని అటవీ అధికారులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..