Viral Photo: ఈ ఫోటోలో ఓ పాము దాగుంది.. నూటికి 99 మంది దాన్ని కనిపెట్టడంలో ఫెయిల్ అయ్యారు
ఇది ఫోటో పజిల్‌కు సంబంధించిన ఆర్టికల్. ఈ ఫోటోలో ఓ పాము దాగుంటి. దాన్ని కనిపెట్టడం చాలా కష్టం. కనుగొన్నారంటే మీరు చాలా గ్రేట్.
ఈ భూమిపై మనుషులు మాత్రమే కాదు. కొన్ని మిలియన్ల జాతుల జీవులు కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని సాధు జీవులైతే, ఇంకొన్ని క్రూరమైనవి. మరికొన్ని ప్రాణ రక్షణ కోసం ఎదుటివారిపై దాడి చేసివిగా ఉంటాయి. అలాంటి వాటిల్లో పాములు కూడా ప్రమాదరకరమైనవిగా చెప్పాలి. ప్రపంచంలో పాముల వల్ల ప్రతి సంవత్సరం సగటున ఒక లక్షన్నర వరకు జనాలు చనిపోతున్నారని నివేదికలు చెబుతున్నాయి. పాము విషం ఒక్క చుక్క చాలు మానవుడిని చంపడానికి సరిపోతుంది. అలాంటి పాముల్లో కొన్ని అందమైనవి కూడా ఉన్నాయి.
మీరు ఇప్పటివరకు ఎన్ని పాములను చూసినా ఇలాంటి పాముని మాత్రం చూసి ఉండరు. ఎందుకంటే ఇది చాలా వెరైటీ స్నేక్. దీని ముఖం ఆకులాగా ఉంటుంది. ఇది చెట్టుపై ఉన్నప్పుడు వీటిని గుర్తించటం చాలా కష్టం. వీటిల్లో ఆడ, మగ లింగబేధాలు కలిగిన పాములుంటాయి. అయితే, మగపాములు కొంచెం డిఫ్రెంట్ గా ఆరెంజ్ ఎల్లో కలర్‌లో ఉంటే… ఆడ పాములు చెట్ల కొమ్మల రంగు బ్రౌన్ కలర్‌లో ఉంటాయి. వీటి పొడవు 3.2 అడుగులు కలిగి ఉంటాయి.., ఇవి ఎక్కువగా మడగాస్కర్ ప్రాంతంలో కనిపిస్తాయి. ఇవి కప్పలను, బల్లులను ఆహారంగా తింటాయి.
పైన ఫోటోలో ఓ పాము దాగుంది. దాన్ని Madagascan Leaf-nosed Snake అంటారు. అదెక్కడుందో మీరు కనిపెట్టే ప్రయత్నం చేయవచ్చు. అక్కడున్న చెట్టు కాడ రంగులో ఆ పాము ఇమిడిపోవడంతో.. నెటిజన్లు దాన్ని కనిపెట్టడానికి కష్టపడుతున్నారు. ఈ పజిల్‌ను చాలామంది సాల్వ్ చేయలేకపోయారు. అయితే మీ చూపుల్లో పదును ఉంటే తీక్షణంగా చూస్తే ఖచ్చితంగా కనిపెట్టేస్తారు. మరి లేట్ ఎందుకు ఈ పజిల్‌ను ట్రై చేయండి. కష్టం మా వల్ల కాదు అనుకుంటే .. క్రింద ఫోటోను చూడండి.
Also Read: “బానే ఉంది సంబడం”.. 10 రూపాయలు పెట్టి కొన్న కోడిపిల్లకు 50 రూపాయల బస్ టికెట్
ఆమ్లెట్ వేసేందుకు గుడ్డు పగలగొట్టగానే బయటకు వచ్చిన అతిథి.. అందరూ షాక్