AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఆమ్లెట్ వేసేందుకు గుడ్డు పగలగొట్టగానే బయటకు వచ్చిన అతిథి.. అందరూ షాక్

అది రోడ్ సైడ్ టిఫిన్ బండి. ఆమ్లెట్ వేడివేడిగా దొరకుతుంది. ఆర్డర్ ఇవ్వగానే నిమిషాల వ్యవధిలో పసందైన ఎగ్ ఆమ్లేట్‌ను చేతిలో పెడతారు.

Viral Video: ఆమ్లెట్ వేసేందుకు గుడ్డు పగలగొట్టగానే బయటకు వచ్చిన అతిథి.. అందరూ షాక్
chicks
Ram Naramaneni
|

Updated on: Jan 03, 2022 | 4:56 PM

Share

అది రోడ్ సైడ్ టిఫిన్ బండి. ఆమ్లెట్ వేడివేడిగా దొరకుతుంది. ఆర్డర్ ఇవ్వగానే నిమిషాల వ్యవధిలో పసందైన ఎగ్ ఆమ్లేట్‌ను చేతిలో పెడతారు. తాజాగా కొందరు కస్టమర్స్.. ఆమ్లేట్ తినేందుకు అక్కడకు వెళ్లారు. ఆర్డర్ ఇవ్వడమే ఆలస్యం.. కుక్ ఓ గుడ్డును పగలగొట్టాడు. వెంటనే అక్కడ ఉన్నవారంతా షాక్‌ తిన్నారు. పెనంమీద గుడ్డు పగలగొట్టగానే అందులోంచి ఓ అతిథి బయటకొచ్చింది. ప్రస్తుతం నెట్టింట ఈ ఆమ్లెట్‌లోంచి వచ్చిన అతిథి వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసి అంతా ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు.

కాగా గుడ్డు పగలగొట్టగానే అందులో నుంచి కోడి పిల్ల బయటకు వచ్చింది. అలా వరసగా 3 గుడ్లు పగలగొట్టగా మూడింటిలోనూ కోడి పిల్లలే ఉన్నాయి. దీంతో ఆ టిఫిన్ బండి వ్యక్తి షాకయ్యాడు. ఆ కోడి పిల్లలను పక్కనే ఉన్న మరో వ్యక్తికి అందించాడు. మాములుగా అయితే.. గుడ్లను కోడి పొదిగితేనే పిల్లలు తయారవుతాయి. కోడి పొదగడం వల్ల.. కోడిపిల్ల తయారవడానికి అవసరమైన వేడి దొరుకుతుంది. కానీ ఆశ్యర్యంగా ఇక్కడ ట్రేలో పెట్టిన గుడ్ల నుంచి పిల్లలు రావడంతో అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. కాగా నెటిజన్లు ఈ వీడియోను తెగ సర్కులేట్ చేస్తున్నారు. భిన్నమైన కామెంట్స్ పెడుతూ ఫ్రెండ్స్‌కు షేర్ చేస్తున్నారు.

Also Read: లైవ్‌లో కన్నీళ్లు పెట్టిన దీప్తి.. హృదయం ముక్కలైన ఎమోజీలు పెట్టిన షణ్ముక్

ఆ జిల్లాలో అర్థరాత్రి భయానక క్షుద్రపూజలు.. పంది గొంతు కోసి.. పసుపు, కుంకుమ చల్లి..

Follow Us
రాబోయే భారీ చిత్రాలకు తప్పని గ్రాఫిక్స్ కష్టాలు
రాబోయే భారీ చిత్రాలకు తప్పని గ్రాఫిక్స్ కష్టాలు
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. త్వరలో పెట్రోల్‌ బైక్స్‌ బ్యాన్..!
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. త్వరలో పెట్రోల్‌ బైక్స్‌ బ్యాన్..!
వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా ?? కారణాలివే
వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా ?? కారణాలివే
స్పిరిట్ పై విమర్శలు.. ఐ డోంట్ కేర్ అంటున్న సందీప్ వంగా
స్పిరిట్ పై విమర్శలు.. ఐ డోంట్ కేర్ అంటున్న సందీప్ వంగా
కలిసి 20 సినిమాలు.. అయినా ఆమెతో 30ఏళ్లు మాట్లాడని హీరో కృష్ణ
కలిసి 20 సినిమాలు.. అయినా ఆమెతో 30ఏళ్లు మాట్లాడని హీరో కృష్ణ
జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర
జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర
చికెన్‌లోని ఈ పార్ట్స్‌తో జాగ్రత్త.. మర్చిపోయి కూడా తినొద్దు..
చికెన్‌లోని ఈ పార్ట్స్‌తో జాగ్రత్త.. మర్చిపోయి కూడా తినొద్దు..
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!
కష్టాల్లో ఉన్నారా? అయితే భగవంతుడు మీకు ఇస్తున్న సంకేతాలివే!
కష్టాల్లో ఉన్నారా? అయితే భగవంతుడు మీకు ఇస్తున్న సంకేతాలివే!