రెండు గంటలు శ్రమించి గద్దను కాపాడిన ఫైర్ సిబ్బంది.. సోషల్ మీడియాలో ఫోటోలు..
వెంటనే అతను ఫైర్ బ్రిగేడ్‌కు సమాచారం ఇవ్వగా వారు హుటాహుటినా ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. గద్దను కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. దాదాపు రెండు గంటలపాటు శ్రమించి ఆ గద్దను రక్షించారు.
ఆపదలో ఉన్న ఓ గద్దను కాపాడేందుకు అగ్నిమాపక విభాగానికి చెందిన జవాన్‌లు దాదాపు రెండు గంటలపాటు శ్రమించాల్సి వచ్చింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లిలో చోటు చేసుకుంది. చెట్టుపై ఉన్న మాంజాలో గద్ద చిక్కుకుపోయింది. ఢిల్లీలోని సీజీవో కాంప్లెక్స్ పరిసరాల్లోగల ఓ చెట్టుపై గద్ద వేలాడుతూ ఉండటాన్ని ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ (ఐటీబీపీ)కు చెందిన ఓ జవాన్ చూశాడు. దాని కాళ్లకు పతంగులు ఎగురవేసేందుకు వినియోగించే మాంఝా చుట్టుకున్నట్లు గుర్తించాడు.
వెంటనే అతను ఫైర్ బ్రిగేడ్‌కు సమాచారం ఇవ్వగా వారు హుటాహుటినా ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. గద్దను కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. దాదాపు రెండు గంటలపాటు శ్రమించి ఆ గద్దను రక్షించారు.
An eagle was rescued by the Fire Brigade at CGO Complex, in Delhi after 2 hours of rescue efforts. The eagle was trapped in manjha on a tree. An ITBP jawan informed Delhi Fire Brigade about the trapped eagle. pic.twitter.com/eTlFOhzjrg
— ANI (@ANI) November 15, 2022
ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ మారింది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన రీతిలో స్పందిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి